
సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఫిబ్రవరి 9న చైర్పర్సన్పిల్లోడి జయమ్మపై 22 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు. సోమవారం మున్సిపల్ఆఫీసులో ఆర్డీవో వసంతకుమారి అధ్యక్షతన కొత్త చైర్పర్సన్ ఎన్నుకునేందుకు బలనిరూపణ పెట్టారు.
22మంది కౌన్సిలర్లు కొత్త చైర్మన్‌గా 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణపాటిల్ను ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. అనంతరం ఆర్డీవో చైర్‌పర్సన్‌గా అపర్ణపాటిల్కు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ఉమా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఖాతాలో సదాశివపేట మార్కెట్ కమిటీ
సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. చైర్మన్‌గా సడాకుల కుమార్, వైస్ చైర్మన్‌గా కంది కృష్ణను నియమించారు. సోమవారం మార్కెట్ కమిటీ ఆఫీసులో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన వారికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి నియామకపత్రాలు అందజేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆఫీసర్లు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.