రెండేళ్ల పాటు వన్డే, టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ అవసరం

రెండేళ్ల పాటు వన్డే, టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ అవసరం

(వెలుగు స్పోర్ట్స్ డెస్క్): వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అద్భుతంగా ఆడిన టీమిండియా మరోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గండాన్ని దాటలేకపోవడం సగటు అభిమానితో పాటు ఆటగాళ్లను తీవ్ర నిరాశ, నిర్వేదంలోకి నెట్టింది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ ప్రాణం పెట్టి ఆడాడు. కప్పు నెగ్గడం  తన కల అని, దాని గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించడం లేదని చెబుతూ వచ్చాడు. కానీ, వరసగా పది మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో జట్టును గెలిపించిన తర్వాత ఆఖరాటలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అతని గుండె పగిలేలా చేసింది. 

మ్యాచ్ ముగిశాక అతడి కండ్లలో నీళ్లు అభిమానులకూ కన్నీళ్లు తెప్పించింది. ఈ పరాజయంతో రోహిత్ చుట్టున్న  ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలినట్లు అనిపిస్తోంది. ఈ టోర్నీ తర్వాత కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అతని ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చ కూడా మొదలైంది. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వయసు ఇప్పుడు 36 ఏండ్లు. 2027లో సౌతాఫ్రికాలో జరిగే వచ్చే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి 40లోకి వస్తాడు. ఈ లెక్కన వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో అతని ప్రయాణం గత ఆదివారంతోనే ముగిసింది అనొచ్చు. 

అయితే, రోహిత్ ఇంకా ఎన్నేండ్లు ఆడుతాడన్నది పక్కనబెడితే టీమిండియాకు కనీసం రెండేళ్ల పాటు వన్డే, టెస్టుల్లో తను కెప్టెన్​గా కొనసాగాల్సిన అవసరం గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ ముగిసినప్పుడు ధోనీ జట్టు బాధ్యతలు అందుకునేందుకు రెడీగా ఉన్నాడు. సారథిగా ధోనీ  నిష్క్రమించినప్పుడు విరాట్ కోహ్లీ రూపంలో అప్పటికే వారసుడు సిద్ధమయ్యాడు.  2021 టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత  కోహ్లీ నుంచి  జట్టు బాధ్యతలు తీసుకోవడానికి రోహిత్ కంటే మెరుగైన వ్యక్తి కనిపించలేదు. 

కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ అన్ని ఫార్మాట్లలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కాగా నడిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వన్డే, టెస్టు ఫార్మాట్ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సరైన యువ ఆటగాళ్లు కనిపించడం లేదు. 

ఈ నేపథ్యంలో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  కొనసాగడం తప్ప సెలెక్టర్లకు వేరే మార్గం లేదు.   బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాన్ని భర్తీ చేయడానికి బదులు బోర్డు, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతడిని కనీసం రెండేండ్ల పాటైనా నాయకుడిగా కొనసాగించడం మంచిది అనిపిస్తోంది. టీమిండియా మరోసారి సంధికాలంలోకి వెళ్లే ఈ సమయంలో అతని సేవలు జట్టుకు కీలకం కానున్నాయి. అయితే ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్న నేపథ్యంలో రోహిత్​ ఇకపై సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎంపిక చేసుకొని ఆడాల్సి ఉంటుంది.  

2025 వరకు ఉండాలె

టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ రోహిత్​ అన్ని పరిస్థితుల్లోనూ టీమ్ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లలో ఒకడిగా ఉన్నాడు. లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ జట్టుకు తను గతంలో కంటే  ఎక్కువ అవసరం. ఎందుకంటే కొత్త  వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ ఇప్పుడే షురూ అయింది. ఐసీసీ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ 2025లో ముగుస్తుంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాకు వన్డే, టెస్టు ఫార్మాట్లలో రెడీమేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లేకపోవడంతో ఈ రెండు ఈవెంట్లు ముగిసేంత వరకైనా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  మెంటార్ రూపంలో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలు కీలకం కానున్నాయి.  

టీ20 ఫార్మాట్ బాధ్యతలను ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను సుదీర్ఘ కాలం నాయకత్వం వహించగలడని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమ్ముతోంది. అయితే, వన్డేల్లో జట్టును నడిపించేందుకు భిన్నమైన మనస్తత్వం  అవసరం. వరల్డ్ కప్​ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంచుకున్నప్పటికీ అతనికి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంకో ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు అప్పగిస్తే అతనిపై మరింత భారం పడనుంది.  కేఎల్ రాహుల్, జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా రూపంలో మరో రెండు చాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కనిపిస్తున్నాయి.  

కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ టెస్టు, వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్సీ చేయగా.. బుమ్రా ఓ టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించాడు. కానీ, ఈ ఇద్దరూ పరిణతి చెందిన కెప్టెన్లుగా కనిపించడం లేదు. రాహుల్ కొన్నేండ్లుగా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్నో సూపర్  జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నాయకత్వం వహించినా ఇంకా టైటిల్ గెలవలేదు. 2021–-22 సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియాకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  వ్యవహరించాడు.  

కానీ, ఒక టెస్టుతో పాటు ఆడిన మూడు వన్డేలనూ కోల్పోయాడు. పాండ్యా  మాదిరిగా బుమ్రాకు సైతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు ఉన్నాయి. పైగా,  కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. తన నాయకత్వంలో ఆటగాళ్లు వన్డే, టెస్టుల్లో డిఫరెంట్ మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడుతున్నారు. అది కొనసాగాలంటే రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరిగా రాబోయే కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉండాలి. 

అలాగే, కనీసం రెండు ఫార్మాట్లలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించే సత్తా తనకు ఉండాలి. ఈ నేపథ్యంలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దిగిపోయే విషయంలో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సారథిగా అతడిని మార్చాలనే విషయంలో బోర్డు, సెలక్షన్​ కమిటీ  ఓపిక, జాగ్రత్త వహించాలి. తన వారసుడిని తీర్చిదిద్దే వరకూ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఐసీసీ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హిట్‌మ్యాన్‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సత్తా చాటిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ఐసీసీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు. టోర్నీలో రాణించిన 11 మందితో ఐసీసీ సోమవారం ప్రకటించిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నుంచి రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ సహా ఆరుగురు చోటు దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6  వికెట్ల తేడాతో ఇండియాను ఓడించి ఆరోసారి కప్ గెలిచింది. 

ఫైనల్ మినహా పది మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఇండియాను గెలిపించిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన నిర్భయమైన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 597 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 765 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. కీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణించిన కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ జడేజా, పేసర్లు బుమ్రా, షమీ కూడా ఈ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. 


ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్: రోహిత్ శర్మ (కెప్టెన్​), క్వింటన్ డి కాక్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్ (కీపర్​), గ్లెన్ మాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ, ఆడమ్ జంపా, దిల్షాన్ మదుషంక. 12వ ప్లేయర్ గెరాల్డ్ కోయెట్జీ.