రష్యాలోని బెల్గోరోడ్ సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఓ అపార్ట్ మెంట్ కూలిపోయి 13 మంది మృతి చెందారు. 20మంది వరకు గాయపడ్డారు. 10 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కొంతభాగం పేకమేడలా కూలిపోయింది. రెస్య్కూ టీంలు సహాయక చర్యలు చేపట్టి బిల్డింగ్ శిధిలాల నుంచి ప్రాణాలతో ఉన్నవారిని రక్షించారు.
ఇప్పటి వరకు 13 మృతదేహాలను బయటకు తీశారు. అపార్ట్ మెంట్ కూలిపోవడానికి ఉక్రెయిన్ షెల్లింగ్ కారణమని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ తోచ్కా- యు టీఆర్సీ క్షిపణి ఫెయిల్ అయి దాని శకలాలు బిల్డింగ్ పై పడ్డాయని రష్యా రక్షణ శాఖ మీడియాకు తెలిపింది.