తిరుమల తిరుపతి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయి, మరింతమంది రుయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దర్శన సమయంలో భక్తులకి సరైన ఏర్పాట్లు చెయ్యకపోవడంవలనే ఈ ఘటన జరిగిందంటూ ప్రతిపక్షాలు, ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇందులోభాగంగా గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన ఘోష వినిపిస్తోందని అలాగే వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపారని అన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ విమర్శించారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని సూచించారు.
చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని APCC పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు.
ALSO READ | తిరుమల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం.. ప్రయాణికుల పడిగాపులు
మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని కాబట్టి తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం.
— YS Sharmila (@realyssharmila) January 9, 2025
ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర…