సీజేఐ కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లేఖ: తిరుమల లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించండి

తిరుమల లడ్డూ విషయంలో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు.  ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.  ఈ గొడవ ఏపీ మత ఘర్షణలకు దారితీసేలా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీక్షలు.. ప్రమాణాలు కాదు.. నిజం కావాలంటూ.. డిక్లరేషన్​.. తిరుమల నిబంధనలు అందరికి వర్తిస్తాయన్నారు.  - జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా ? లేదా ? ఆయన ఇష్టం.. - రూల్స్ అందరికీ వర్తించాలి.. - అంతా రూల్ ప్రకారం నడవాలని షర్మిల అన్నారు.

ALSO READ | తిరుమల వివాదం : జగన్.. ఈ ఫారంపై సంతకం పెట్టి.. శ్రీవారిని దర్శించుకో : బీజేపీ

జగన్ సర్కార్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే...  కూటమి సర్కార్ లడ్డూలో మత రాజకీయాలు కలుపుతుందని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల అన్నారు.  ప్రస్తుతం ఏపీలో పాలన జరుగుతుందా అని ప్రశ్నించారు.  సీఎం చంద్రబాబు శాంతి హోమాలు.. ఉప ముఖ్యమంత్రి పవన్​ దీక్షలు.. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్​ ప్రక్షాళన పూజలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హిందూమతాన్ని అంతం చేసేందుకు కేంద్ర కుట్ర పన్నారని... మత ఘర్షణలు జరగాలని వారు హిడెన్ అజెండా పెట్టుకుని ... మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఏపీ కాంగ్రెస్​ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. బీజేపీ డైరక్షన్​ లో పవన్​.. మోదీ డైరక్షన్​ లో చంద్రబాబు పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై జనాలు తిరగబడతారని .. ఇప్పుడు తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. -