
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 25,284 మందికి పరీక్షలు చేయగా 5,879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్న ఆదివారం కావడంతో కరోనా పరీక్షలు సగానికి తగ్గగా.. కేసుల నిర్ధారణ కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో సాధారణంగా ప్రతిరోజు దాదాపు 50వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గడచిన 24 గంటల్లో.. అంటే నిన్న ఆదివారం కావడంతో కేవలం 25,284 మందికే పరీక్షలు జరిగినట్లు తెలుస్తోంది. పరీక్షలు తగ్గిపోవడంతో.. కొత్త కేసులు కూడా అదే స్థాయిలో సగానికి తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.
మరో వైపు గడచిన 24గంటల్లో కరోనా నుంచి 11,384 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లిపోయారని.. 9 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలోని జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి....
ఇవి కూడా చదవండి
AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం