![సంతానలేమి పరిష్కారానికి ఓవాపెక్స్](https://static.v6velugu.com/uploads/2023/07/ovex_oyXcSCHj5N.jpg)
హైదరాబాద్ , వెలుగు: అపెక్స్ లాబొరేటరీస్‌కి చెందిన హెర్బల్ విభాగం గ్రీన్ మిల్క్ కాన్సెప్ట్స్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), స్త్రీలలో సంతానలేమి సమస్యల పరిష్కారానికి ఓవాపెక్స్ పేరుతో ఓ మందును లాంచ్ చేసింది. పీసీఓఎస్‌తో లక్షలాది మంది స్త్రీలు బాధపడుతున్నారని కంపెనీ పేర్కొంది. దీని ప్రభావంతో రుతుక్రమం సక్రమంగా లేకపోవడం, సంతానలేమి సమస్య, బరువు పెరగడం, మొటిమలు వంటి ఇబ్బందులు నెలకొంటున్నాయని వెల్లడించింది.
హార్మోన్ల అసమతుల్యతలను పరిష్కరించడానికి వివిధ ఆయుర్వేద పదార్థాలతో ఓవాపెక్స్‌ను తీసుకొచ్చామని జీఎమ్‌సీ అపెక్స్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ వీ సుభాషిణి అన్నారు. ఈ మందు సాధారణ రుతుచక్రాన్ని ప్రోత్సహిస్తుందని, సంబంధిత లక్షణాలను తగ్గిస్తుందని
పేర్కొన్నారు.