ఏపీజీవీబీ బ్రాంచ్​లు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ లోకి..

ఏపీజీవీబీ బ్రాంచ్​లు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ లోకి..

హనుమకొండసిటీ, వెలుగు : రాష్ట్రంలోని ఏపీజీవీబీ శాఖలను తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో విలీనం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్ లో ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలోని 493 శాఖలు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో విలీనం అవుతున్నాయని చెప్పారు.

ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు బ్రాంచ్ ఆపరేషన్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ లు నిలిపివేయనున్నామని, వినియోగదారులు గమనించాలని కోరారు. 2025 జనవరి 1 నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.