హైదరాబాద్ లో ఆరు నెలల్లో 18 లక్షల ఉద్యోగ దరఖాస్తులు

హైదరాబాద్ లో ఆరు నెలల్లో 18 లక్షల ఉద్యోగ దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు:   గత ఆరు నెలల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 18 లక్షలకుపైగా కొత్త ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని జాబ్  ప్రొఫెషనల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ ‘అప్నా డాట్​ సీఓ’ వెల్లడించింది. వీటిని బట్టి చూస్తే నగర జాబ్​మార్కెట్​బలంగా వృద్ధి చెందుతోందని తెలిపింది. 

వీటిలో ఏడు లక్షల అప్లికేషన్లు మహిళల నుంచి వచ్చాయి.  ఇదేకాలంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్​ మార్కెట్​కు 30 వేల తాజా ఉద్యోగ పోస్టులు వచ్చాయి. అప్నా డాట్​ సీఓ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఆరు నెలల్లో 1.50 లక్షల మంది కొత్త యూజర్లను చేర్చుకుంది. అంతేగాక12 వేల మందికిపైగా కొత్త యజమానులు అప్నా డాట్​ సీఓలో చేరారు.   సేల్స్ & బిజినెస్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, డెలివరీ, డ్రైవర్, లాజిస్టిక్స్, అడ్మిన్, బ్యాక్ ఆఫీస్ రోల్స్​కు ఎక్కువ   డిమాండ్​ ఉందని ఈ సంస్థ తెలిపింది.