హైదరాబాద్, వెలుగు: అపోలో క్యాన్సర్ సెంటర్స్ (ఏసీసీ), హైదరాబాద్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) అవుట్‌పేషెంట్ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. లింపోమా, మైలోమా, హెమలాజిక్ ట్రీట్‌మెంట్‌లో బీఎంటీ వాడుతున్నారు.
బీఎంటీ సర్వీస్‌లతో రోగి హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదని, ఖర్చులు కూడా సగానికిపైగా తగ్గుతాయని ఏసీసీ పేర్కొంది. పేషెంట్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని బీఎంటీ అవుట్‌పేషెంట్ ప్రోటోకాల్‌ను డిజైన్ చేశామని. హాస్పిటల్‌కు నిమిషంలోనే రాగలిగే , తీవ్రమైన జబ్బులు లేని యంగ్ పేషెంట్లకు ఈ ప్రోటోకాల్ బాగా సరిపోతుందని ఈ కంపెనీ సీఈఓ తేజస్వి వీరపల్లి అన్నారు.