అపోలో ప్రాసెసింగ్ ల్యాబ్​ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: అపోలో డయాగ్నోస్టిక్స్ తన140వ ప్రాసెసింగ్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరుపతిలో ఆరంభించింది.  నెలకు ఇది 25 వేల శాంపిల్స్​ను పరీక్షించగలుగుతుంది. చాలా రకాల టెస్టులను చేస్తుంది. ఇండ్ల నుంచి కూడా శాంపిల్స్​ తీసుకుంటామని సంస్థ తెలిపింది. 

తిరుపతివాసులకు అపోలో డయాగ్నోస్టిక్స్ నుంచి 3,000 పరీక్షలు, ఎక్స్​పర్ట్​ హెల్త్ చెకప్ ప్యాకేజీలు ఉన్నాయి.  ఇక్కడ హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ పాథాలజీ, సెరోలజీ, మైక్రోబయాలజీతో సహా పలు విభాగాలు ఉన్నాయి. మానవ తప్పిదాలను నివారించడానికి పూర్తిగా ఆటోమేటెడ్ సాధనాలను ఉపయోగిస్తామని సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు వివరించారు.