
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం 20 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రెండో జాబితాను విడుదల చేసింది. ఇందేలో 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను నిరాకరించింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో సహా మరొకరి స్థానాన్ని మార్చింది.
సిసోడియాను పట్పర్ గంజ్ స్థానం నుంచి కాకుండా జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి ఇటీవలే ఆప్‌లో చేరిన విద్యావేత్త అవధ్ ఓజా పోటీ చేయనున్నారు. తన సీటును మార్చడంపై సిసోడియా స్పందించారు. పట్ పర్ గంజ్‌లో చేసిన అభివృద్ధిని జంగ్‌పురాలో చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ALSO READ : రిఫార్మ్.. పర్ఫార్మ్.. ట్రాన్స్‌ఫార్మ్..ఇదే భారత్ అభివృద్ధి మంత్ర
డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా స్థానాన్ని మంగోల్ పురి నుంచి మాదిపూర్కు మార్చారు. మంగోల్‌పురిలో రాకేష్ జాతవ్ ధర్మరక్షక్ పోటీ చేయనున్నారు. నరేలా ఎమ్మెల్యే శరద్ కుమార్ చౌహాన్ స్థానంలో దినేష్ భరద్వాజ్, తిమార్ పూర్ ఎమ్మెల్యే, పార్టీ చీఫ్ విప్ దిలీప్ కె. పాండే స్థానంలో సురేంద్ర పాల్ సింగ్ బిట్టు బరిలోకి దిగనున్నారు.