కరోనా పేషంట్లను గుర్తించే యాప్.. మీరు కూడా చెక్ చేయోచ్చు…

కరోనా పేషంట్లను గుర్తించే యాప్.. మీరు కూడా చెక్ చేయోచ్చు…

అలర్ట్ చేస్తది… ఆరోగ్య సేతు యాప్
కరోనా ట్రాకింగ్ యాప్ ను రూపొందించిన కేంద్రం
క్వారంటైన్ వ్యక్తులు, కరోనా పేషెంట్లు సమీపంగా వస్తే సమాచారమిస్తది

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తాజాగా కరోనా ట్రాకింగ్ యాప్ ను రూపొందించింది. గురువారం
అధికారికంగా దీనిని ప్రారంభించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఈ యాప్ ను రూపొందించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) గైడెన్స్ తో కేవలం నాలుగు రోజుల్లోనే దీన్ని తయారు చేసింది. మొదట ఈ యాప్ ను ‘కరోనా కవచ్’ అని పిలవగా, అఫీషియల్ గా ‘ఆరోగ్యసేతు’ అనే పేరు పెట్టింది. యూజర్ల వివరాలు కేవలం ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావని కేంద్రం స్పష్టం చేసింది.

ఉపయోగం ఏంటి?
క్వారంటైన్ వ్యక్తులు, కరోనా పాజిటివ్ వచ్చిన వారెవరైనా యూజర్ కు సమీపంలో ఉన్నట్లయితే ఈ యాప్ అలర్ట్ చేస్తుంది.
కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలనే దానిపై గైడెన్స్ ఇస్తుంది. సెల్ఫ్ ఐసోలేషన్ గురించి వివరిస్తుంది.
ఇందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కరోనా హెల్ప్ లైన్ నంబర్లు ఉంటాయి.
యాప్ లో చాట్ బోట్ కూడా ఉంటుంది. ఇది కరోనా వైరస్ లక్షణాలను వివరిస్తుంది. వైరస్ విషయంలో యూజర్ల అనుమానాలను తీరుస్తుంది.
సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అప్డేట్స్ ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే హెల్త్ మినిస్ట్రీ లైవ్ ట్వీట్స్ ను యాప్ లోనే చూడొచ్చు.

డౌన్ లోడ్ ఎట్ల ?
ఈ యాప్ అటు ఐఓఎస్, ఇటు ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులో ఉంది. యాపిల్ యాప్ స్టోర్, గూగూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఎట్ల పని చేస్తది?
ఇది జీపీఎస్ లొకేషన్, బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. మీ ఫోన్ జీపీఎస్, బ్లూటూత్ ను ఎప్పుడూ ఆన్ లోనే ఉంచాలి. వీటి ద్వారానే క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు గానీ, కరోనా పాజిటివ్ వచ్చిన వారు గానీ… మీకు దగ్గరగా వచ్చినప్పుడు యాప్ అలర్ట్ చేస్తుంది.

For More News..

పాప కరోనా.. బాబు కోవిడ్.. ట్విన్స్ కు పేర్లు పెట్టిన పేరెంట్స్

100 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన వరల్డ్ బ్యాంక్

నేటి నుంచి 10 లక్షల మందికి ఉచిత భోజనం

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు