Delhi Results: లీడింగ్ లోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా, అతీశీ

Delhi Results:  లీడింగ్ లోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా, అతీశీ

ఢిల్లీ ఓట్ల లెక్కింపు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. రెండు రౌండ్లలో వెనకబడిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు.. మూడో రౌండ్ నుంచి పుంజుకున్నారు. లీడింగ్ లోకి వచ్చారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి.. ఆప్ అగ్రనేత కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి 343 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఇక జంగ్ పుర నుంచి మనీష్ సిసోడియా, కల్కాజీ స్థానం నుంచి సీఎం అతీశీ ముందంజలోకి వచ్చారు. 

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన  ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తొలి రౌండ్లో వెనుకంజలో ఉన్నారు. అయితే రెండో రౌండ్ లెక్కింపులో మళ్లీ లీడ్ లోకి వచ్చారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 6,442 ఓట్లు వచ్చాయి. ముందు నుంచి బీజేపీ నేత పర్వేశ్ వర్మ  ముందంజలో ఉండగా.. మళ్లీ కేజ్రీవాల్ ముందుకొచ్చారు. శీలాదీక్షిత్ తనయుడు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ 1092 ఓట్లతె వెనుకంజలో ఉన్నారు. 

ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ లీడ్ లో కొనసాగారు. అయితే రెండో రౌండ్ లో కేజ్రీవాల్ లీడ్ లోకి రాగా.. ప్రస్తుతం పర్వేశ్ వర్మకు 6099 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.