కాగజ్ నగర్ ఎఫ్ డీవోగా అప్పలకొండ బాధ్యతలు

కాగజ్ నగర్, వెలుగు : ఆసిఫాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పని చేస్తున్న అప్పలకొండకు కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం డివిజన్ ఆఫీస్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రేంజ్ ఆఫీసర్లు, స్టాఫ్ అభినందించి ఆయనకు బొకే అందించారు.