- ఆదర్శంగా నిలుస్తున్న లింగారెడ్డి గూడ, అప్పారెడ్డి గూడ గ్రామస్తులు
షాద్ నగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడ, నందిగామ మండలంలోని అప్పారెడ్డి గూడ గ్రామస్తులు ఊరంతా కలిపి ఒక్కడే వినాయకుడిని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. లింగారెడ్డిగూడలో 1980 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అప్పట్లో చల్లా సుదర్శన్ రెడ్డి ప్రారంభించగా..ప్రస్తుతం గ్రామంలో 3వేల జనాభా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇక్కడ 2022లో జరిగిన లడ్డూ వేలంలో మెహరాజ్ రూ. 2 లక్షల 50 వేలకు కైవసం చేసుకున్నాడు. అప్పారెడ్డిగూడలో కూడా 40 ఏండ్ల నుంచి ఒకే వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు.
ఇక్కడ 1500 మంది జనాభా ఉండగా..అంతా కలిసి ఒకే మండపం ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు. గ్రామంలో శబ్ద, జల కాలుష్యం, పోటీ వాతావరణాన్ని తగ్గించేందుకు, అందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని లింగారెడ్డిగూడ గ్రామస్తుడు వీరేశ్ గౌడ్, అప్పారెడ్డి గూడా మాజీ డిప్యూటీ సర్పంచ్ సీతారాములు తెలిపారు.