![జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారు: చింతపల్లి సభలో షర్మిల](https://static.v6velugu.com/uploads/2024/02/appcc-chief-sharmila-hot-comments-on-bjp-and-ysrcp_8DmX4S7rh1.jpg)
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు... మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. పులి, సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ధ్వజమెత్తారు. నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎత్తిపొడిచారు. నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎలా తరిమికొట్టారో, రాష్ట్రంలో నియంత పాలకులను కూడా అలాగే తరిమికొట్టాలని అన్నారు.
ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం, ప్రజలకు మద్దతుగా నిలవని ప్రతిపక్షం మనకు వద్దు అని పిలుపునిచ్చారు.ఆదివాసీలు అంటే YSR కి ఎంతో అభిమానమని - ఐటీడీఏ పరిధిలో కేంద్రం నుంచి వచ్చిన 3 వేల కోట్లు ప్రతి పైసాను వైఎస్సార్ ఖర్చు చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు,కాలేజీలు,ఆసుపత్రులు అన్ని కట్టించారనీ... ఆయన హయాంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలతో ఆ భూమికి పాస్ బుక్ లు ఇచ్చి... లోన్ లు వచ్చే విధంగా చేశారన్నారు.
ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన రోడ్లపైనే ఈ రోజు కూడా జనాలు ప్రయాణిస్తున్నారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ది గురించి ఆలోచించలేదతీ.... రోడ్లు లేక ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారంటూ.... ఇప్పటి ప్రభుత్వాలకు బాక్సైట్ తవ్వకాల మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల అభివృద్ధి మీద లేదన్నారు. జీఓ 3 రద్దుతో ఆదివాసీల హక్కులు హరిస్తూ గిరిజన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు.
ALSO READ:- ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న వెస్టిండీస్ సంచలనం
కాంగ్రెస్ అధికారంలో వచ్చాక జీఓ 3 నీ అమలు చేస్తామన్నారు. 1/70 యాక్ట్ విషయంలో గిరిజనుల పక్షాన మా పోరాటం ఉంటుంది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే... మన గిరిజన ప్రాంతాలు బాగుపడేవి... జగన్ అన్న 25 ఎంపీ లు ఇస్తే హోదా తెస్తాం అన్నారు.. అధికారంలో వచ్చాక ఒక్క ఉద్యమం లేదు..హోదా తేవడం చేతకలేదు కానీ... సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు . ఏపీకి హోదా రావడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడిఉందని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని తెలిపారు . వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరారు.