యాపిల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాడ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ హైదరాబాద్‌‌లోనే

యాపిల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాడ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ హైదరాబాద్‌‌లోనే

న్యూఢిల్లీ: ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్న  ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో యాపిల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాడ్స్‌‌‌‌‌‌‌‌ తయారుకానున్నాయి. రాష్ట్రంలో 550 మిలియన్ డాలర్లను కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను కొంగరు కొలాన్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని అంచనా. వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌  ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ (టీడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌) లో యాపిల్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతోంది. కెనాలసిస్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో యాపిల్ మార్కెట్ వాటా 35 శాతంగా ఉంది. 

దీని తర్వాత శామ్‌‌‌‌‌‌‌‌సంగ్‌‌‌‌‌‌‌‌ 7.5 శాతం మార్కెట్‌‌‌‌‌‌‌‌ వాటాతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. షావోమి వాటా 4.4 శాతంగా, బోట్‌‌‌‌‌‌‌‌ వాటా 4 శాతంగా ఉన్నాయి. షావోమి కూడా తన వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను నోయిడా ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో స్టార్ట్ చేసింది. మరోవైపు  ఐఫోన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ4 లో సీ–టైప్ యూఎస్‌‌‌‌‌‌‌‌బీ పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. ఐఫోన్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ  సిరీస్‌‌‌‌‌‌‌‌కు సక్సెస్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌గా ఈ ఫోన్ వస్తోంది. లైటింగ్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి సీ–పోర్ట్‌‌‌‌‌‌‌‌కు యాపిల్‌‌‌‌‌‌‌‌ షిఫ్ట్ అవ్వడం ఊహించిందే. అంతేకాకుండా వచ్చే నెలలో ఐఫోన్‌‌‌‌‌‌‌‌ 15 ని కూడా  లాంచ్ చేయనుంది.