మొదటి 1ట్రిలియన్ గ్లోబల్ బ్రాండ్ గా ‘‘ఆపిల్’’

మొదటి 1ట్రిలియన్ గ్లోబల్ బ్రాండ్ గా ‘‘ఆపిల్’’

Apple బ్రాండ్ విలువలో 1ట్రిలియన్ డాలర్లను దాటింది. గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరిగి 2024లో ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా మొదటి స్థానంలో ఉంది. Google , Microsoft తర్వాత స్థానాల్లో ఉన్నాయి. Nvidia విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. బ్రాండ్ల విలువలో 200బిలియన్లతో టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్ లలో చోటు దక్కించుకుంది. 

కంటార్ ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ .. బ్రాండ్జ్ 2024 మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్టును విడుదల చేసింది.   రిపోర్టు ప్రకారం.. 2024లో  టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల సంయుక్త విలువ20 శాతం పెరిగింది.ఇది గణనీయమైన పెరుగుదల.  2023తో పోలిస్తే  మొత్తం 1.4 ట్రిలియన్ల వృద్ధికి టెక్ బ్రాండ్ల పనితీరు ప్రధానంగా దోహదపడ్డాయి. టెక్ బ్రాండ్ల విలువ 1.2 ట్రిలియన్లుగా ఉంది. 

యాపిల్ వరుసగా మూడో సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా 1ట్రిలియన్ బ్రాండ్ విలువను అధిగమించిన మొదటి బ్రాండ్.  Googlec  753.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, మైక్రోసాఫ్ట్ 712.3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాయి. అమెజాన్ 576.6 బిలియన్ డాలర్లతో తర్వాత స్థానం, మెక్ డోనాల్స్ 221.9 బిలియన్ డాలర్లతో 5 స్థానంలో ఉన్నాయి.