యాపిల్ కంపెనీ నెక్స్ట్ జనరేషన్ M2, M2 ప్రో చిప్‌సెట్‌లను తీసుకొచ్చింది. గతేడాది ఇదే పేర్లతో చిప్‌సెట్లను లాంఛ్ చేయగా వాటి అడ్వాన్స్ వెర్షన్ గా ఇవి వచ్చాయి. లాస్ట్ జనరేషన్ తో పోలిస్తే ఈ చిప్ సెట్లలో సీపీయూపరంగా 20శాతం, జీపీయూపరంగా 30శాతం ఇంప్రూవ్ మెంట్ ఉందని యాపిల్ ప్రకటించింది. ఈ చిప్ సెట్లను మ్యాక్ బుక్, మ్యాక్ మినీల్లో వాడనున్నారు.
తాజాగా యాపిల్ M2, M2 ప్రో చిప్‌సెట్ తో మ్యాక్ బుక్, మ్యాక్ మినీలను లాంఛ్ చేసింది. వీటి ధర రూ.1.30లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి మ్యాక్ బుక్స్ ను కస్టమైజ్ ఆప్షన్ తో తీసుకొచ్చారు. కస్టమర్లు కోరుకున్నట్లు వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అంతేకాదు 14,16 అంగుళాల డిస్ ప్లే సైజులో మ్యాక్ బుక్ రానున్నాయి.