ఆపిల్ తన ప్రతిష్టాత్మకమైన ఆపిల్ కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేసుకుంది. ఇది టెక్ దిగ్గజాన్ని సరికొత్త స్థాయికి తీసుకెల్లే ప్రాజెక్టు అయినప్పటికీ దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ ప్రాజెక్టుకోసం శ్రమించిన ఆపిల్ సిబ్బంది.. చివరికి ఫిబ్రవరి 27, 2024లో ఈ కారు ప్రాజెక్టును ఉపసంహరించుకుంది. 2014 లో టైటాన్ అనే పేరుతో సీక్రెట్ గా ఈ ప్రాజెక్టును ప్రారంభించిన ఆపిల్ ఎలక్ట్రిక వాహనాలను తయారు చేయడంలో సీరియస్ గా వర్క్ చేసింది. వందలాది మంది ఉద్యోగులను ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ ప్రాజెక్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
యూనైటెడ్ స్టేట్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు మందగించడం, ఉత్పాదక AI పై యాపిల్ దృష్టి, ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కొనుగోలు దారులను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల కంటే హైబ్రిడ్ వాహనాలను ఎంచుకోవడానికి ప్రోత్సహించడంతో Apple కార్ల ప్రాజెక్టు టైటాన్ ను మూసివేయడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ALSO READ :- ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఢిల్లీలో తొమ్మిదేళ్లకు కొత్త వాతావరణం
యాపిల్ కార్ల తయారీ ప్రాజెక్టు దశలవారీగా నిలిపివేయబడుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేయబడుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ ఒకరు తెలిపారు. ఈ ఉద్యోగులకు బదులుగా ఉత్పాదక AI ని అభివృద్ది చేయడంపై దృష్టి పెడతామని వెల్లడించారు.