
త్వరలో యాపిల్ సంస్థ ‘యాపిల్ కార్డ్’ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ముందే కొంతమంది సెలెక్టెడ్ యూజర్ల కోసం ఇప్పటికే ‘యాపిల్ కార్డ్’ను తీసుకొచ్చింది. ఐఓఎస్ 12.4 , ఆపై వెర్షన్ యాపిల్ ఫోన్లు వాడుతున్న యూజర్లలో కొందరికి డిజిటల్/ఫిజికల్కార్డులను అందిస్తోంది. యూజర్లు బర్త్‌డేట్, అడ్రస్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ వంటి పర్సనల్డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా ‘కార్డు’ సైన్ అప్ చేయొచ్చు. ఈ సమాచారం మొత్తాన్ని ఒక నిమిషంలో ‘గోల్డ్‌మన్ శాచ్’ బ్యాంక్ విశ్లేషించి, అర్హులైతే వెంటనే అప్రూవ్ చేస్తుంది. ఇతర కార్డుల్లాగా దీనికి నెంబర్ ఉండదు. కార్డుపై ఎక్స్పైరీ డేట్, సీవీవీ వంటివి కూడా ఉండకపోవడం దీని ప్రత్యేకత. ప్రస్తుతానికి జీరో ప్రాసెసింగ్ ఫీతోనే కార్డ్స్‌ను అందిస్తోంది యాపిల్. డైలీ పర్చేజెస్కు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉన్నాయి.