ప్రపంచ నెంబర్ వన్ టెక్ కంపెనీ యాపిల్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. యాపిల్ ఉత్పత్తుల తయారీని చైనా నుంచి ఇండియా తరలించనున్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల ఇండియాలో 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించింది. ప్రత్యక్షంగా.. నేరుగా 2 లక్షల మందికి ఉద్యోగాలు రావటమే కాకుండా.. పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని యాపిల్ వివరించింది. చైనా నుంచి ఇండియాకు యాపిల్ ఉత్పత్తుల తయారీ ప్లాంట్లను తరలించటం ద్వారా.. ఇండియాలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది యాపిల్.
ఇప్పటికే చెన్నైలో యాపిల్ ఐఫోన్ల తయారీ యూనిట్ ఉంది.. తమిళనాడులోని పెరంబూదుర్ లో యాపిల్ ఫోన్స్ తయారీ యూనిట్ ఫాక్స్ కాన్ కంపెనీ ఉంది. ఐ ఫోన్ లో కొత్తగా లాంచ్ కానున్న16 సిరీస్ లో వేరియంట్ల మ్యానిఫ్యాక్చర్ కూడా పెరంబూదూర్ లో ట్రెనింగ్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థ ఇండియాకు వస్తే ప్రతి ఉద్యోగం అదనంగా మరో ముగ్గురికి పరోక్ష ఉపాధి కల్పిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇవి 5 నుంచి 6 లక్షలుగా ఉండొచ్చని భావిస్తున్నారు. యాపిల్ కంపెనీ కల్పించనున్న ఉద్యోగాల్లో 70 శాతానికి పైగా మహిళలు ఉంటారని నివేదికలు చెబుతున్నాయి. ఇట్స్ గ్లోటైమ్ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కోసం ఆపిల్ అధికారికంగా ఆహ్వానాలను పంపింది. ఆపిల్ ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9 న నిర్వహించనుంది.