టూల్ గాడ్జెట్స్

టూల్ గాడ్జెట్స్

ఇయర్‌‌‌‌ బడ్స్ స్ట్రాప్స్‌‌

ఇయర్‌‌‌‌ బడ్స్ కొందరి చెవుల నుంచి జారి పోతుంటాయి. మామూలు ఇయర్‌‌‌‌ బడ్స్‌‌ పోతే పర్లేదు. కానీ.. యాపిల్‌‌ లాంటి ఖరీదైన బడ్స్‌‌ పోగొట్టుకుంటే వేలకు వేలు నష్టం. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా ఇయర్‌‌‌‌ బడ్స్‌‌ కోసం తయారు చేసిన ఈ స్ట్రాప్‌‌ వాడితే సరిపోతుంది. ఈ స్ట్రాప్‌‌ని సిలికాన్‌‌తో తయారుచేస్తారు. కాబట్టి స్కిన్‌‌కు కంఫర్ట్‌‌గా ఉంటుంది. మార్కెట్‌‌లో చాలా కంపెనీలు వీటిని తయారుచేస్తున్నాయి. దీని పొడవు 27.5 అంగుళాలు ఉంటుంది. ఆటలు ఆడేటప్పుడు, జాగింగ్‌‌, రన్నింగ్‌‌, డాన్స్‌‌ చేసేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిలో మ్యాగ్నెట్స్‌‌ కూడా ఉంటాయి. రెండు బడ్స్‌‌ని చెవి నుంచి తీయగానే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి.                                      

ధర: 105 రూపాయల నుంచి మొదలు

లింట్ రిమూవర్‌‌‌‌ 

కొత్త బట్టలు నాలుగైదు సార్లు ఉతకగానే పోగులు లేస్తుంటాయి.  ముఖ్యంగా కాటన్‌‌, ఉన్ని క్లాత్‌‌కు ఎక్కువగా పోగులు తేలుతుంటాయి. దాంతో కొత్త బట్టలను కూడా పక్కన పడేయాల్సిన పరిస్థితి. కానీ.. ఈ లింట్‌‌ రిమూవర్‌‌‌‌తో అలాంటి పోగులను ఈజీగా తీసేయొచ్చు. చాలా కంపెనీలు మార్కెట్‌‌లోకి లింట్‌‌ రిమూవర్‌‌‌‌లను తెచ్చాయి. నోవా కంపెనీ తీసుకొచ్చిన లింట్‌‌ షేవర్.. స్వెటర్లు, జాకెట్లు, సోఫాలు, ఖరీదైన బొమ్మలు, తివాచీల పోగులను క్షణాల్లో తీసేస్తుంది. ఇది కరెంట్‌‌తో పనిచేస్తుంది. డైరెక్ట్‌‌గా ప్లగ్​కు పెట్టి వాడుకోవచ్చు. ఇది ఏడాది వారెంటీతో వస్తుంది. 

ధర: 359 రూపాయలు

హెడ్‌‌ ‌‌ఫోన్స్‌‌ హోల్డర్‌‌‌‌

గేమింగ్‌‌, వీడియో ఎడిటింగ్‌‌ చేసేవాళ్లకు హెడ్‌‌ ఫోన్స్‌‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండు మూడు రకాల హెడ్‌‌ ‌‌ఫోన్స్‌‌ ఎప్పుడూ డెస్క్‌‌ మీదే పెట్టుకుంటారు. కాకపోతే వాటి వైర్ల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే వాటిని డెస్క్‌‌ మీద కాకుండా డెస్క్‌‌ కింద పెట్టుకోవాలి. అందుకోసం మార్కెట్‌‌లోకి అందుబాటులో ఉన్న ఈ అండర్‌‌‌‌ డెస్క్ హెడ్‌‌ఫోన్స్ మౌంట్ వాడుకుంటే సరి. 

దీనికి ఉండే హ్యాంగర్‌‌‌‌కి  4 హెడ్‌‌ఫోన్స్ తగిలించొచ్చు. దీన్ని బ్రెయిన్‌‌వావ్జ్‌‌ కంపెనీ తయారుచేసింది. హై గ్రేడ్ ప్లాస్టిక్‌‌తో తయారు చేయడం వల్ల ఇది చాలా స్ట్రాంగ్‌‌గా ఉంటుంది. 3 ఎం వీహెచ్‌‌పీ టేప్‌‌తో డెస్క్‌‌ కింద అతికించొచ్చు. ఇది గరిష్టంగా 2 కిలోల బరువు మోయగలదు. దీన్ని కేబుల్ ఆర్గనైజర్‌‌గా కూడా వాడుకోవచ్చు.                  

ధర: 499 రూపాయలు 

మోషన్‌‌ ఎల్‌‌ఈడీ

చీకట్లో మెట్లు ఎక్కేటప్పుడు లైట్లు వేస్తుంటాం. కానీ.. ఆఫ్​ చేయడం మర్చిపోయి ఇంట్లోకి వెళ్లిపోతాం. ఒకవేళ తర్వాత గుర్తొచ్చినా వాటిని ఆఫ్​ చేయడానికి మళ్లీ కిందికి దిగి రావాల్సి వస్తుంది. రెండో అంతస్తు లేదా ఆ పై అంతస్తుల్లో ఉండేవాళ్లకు ఈ సమస్య మరీ  ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకోసమే మోషన్​ సెన్సర్​తో పనిచేసే లైట్‌‌ని తెచ్చింది ఎలోక్సీ అనే కంపెనీ. మెట్లు ఎక్కుతున్నంత సేపు ఆటోమెటిక్‌‌గా వెలుగుతుంది. ఫ్లోర్‌‌‌‌ పైకి వెళ్లగానే లైట్‌‌ ఆఫ్​ అయిపోతుంది.

 ఈ లైట్‌‌ని ఎక్కడైనా స్టిక్‌‌ చేయొచ్చు. బ్యాటరీతో పనిచేస్తుంది. మైక్రో యుఎస్‌‌బి పోర్ట్‌‌ ద్వారా ఛార్జింగ్‌‌ పెట్టుకోవాలి. ఇందులో 400mAh లిథియం రీఛార్జబుల్‌‌ బ్యాటరీ ఉంది. దీన్ని పూర్తిగా ఛార్జింగ్​ చేయడానికి రెండు గంటలు పడుతుంది. ఆటో మోడ్‌‌లో పెట్టి వాడితే చాలా రోజులు పనిచేస్తుంది. దీనికి ఐదు నుంచి పది అడుగుల దూరంలో మనిషి ఉన్నప్పుడు లైట్‌‌ ఆన్‌‌ అవుతుంది. ఆ తర్వాత15 నుంచి 20 సెకన్ల తర్వాత ఆటోమెటిక్‌‌గా ఆఫ్​ అయిపోతుంది. 

దీని లోపల ఆరు పవర్‌‌‌‌ఫుల్‌‌ ఎల్‌‌ఈడీ లైట్లు ఉన్నాయి. దీన్ని ఇన్‌‌స్టాల్‌‌ చేయడానికి కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. రెండు వైపుల అతుక్కునే టేప్‌‌తో లేదా దీనికి ఉండే మ్యాగ్నెట్‌‌తో ఈజీగా ఇన్‌‌స్టాల్‌‌ చేయొచ్చు. బెడ్‌‌రూం, హాల్‌‌, వాష్‌‌రూమ్, కిచెన్, వార్డ్‌‌రోబ్, కారిడార్, మెట్లు, డార్క్ క్లోసెట్‌‌లు, షెల్ఫ్, క్యాబినెట్స్​లో కూడా వాడుకోవచ్చు. 

ధర: 333 రూపాయలు