22 గంటల బ్యాటరీ లైఫ్​తో కొత్త మ్యాక్​బుక్స్​

22 గంటల బ్యాటరీ లైఫ్​తో కొత్త మ్యాక్​బుక్స్​

యాపిల్​  సరికొత్త ఎం3 ఫ్యామిలీ ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన మ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ప్రో మోడల్స్‌‌‌‌‌‌‌‌ను ఇండియా మార్కెట్​లో లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో లిక్విడ్ రెటీనా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఆర్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలు ఉంటాయి. ఏకంగా 22 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తాయి. కొత్త ఎం3 మ్యాక్​ప్రో ధర  (14-అంగుళాలు)  ఎం3 చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన బేస్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1,69,900, కాగా ఎం3 ప్రో చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన 14-అంగుళాల వేరియంట్ ధర రూ.రెండు లక్షల నుంచి మొదలవుతుంది. అయితే 16-అంగుళాల డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేతో మ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ప్రో  బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 2.50 లక్షలని కంపెనీ తెలిపింది.