Apple Jobs: ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి గుడ్న్యూస్..యాపిల్ రిటైల్ స్టోర్లలో 400 ఉద్యోగాలు

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్.. భారత్ లో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో లలో రెండు రిలైట్ స్టోర్లను ప్రారంభించిన ఆపిల్.. తాజాగా బెంగళూరు, పూణె, ఢిల్లీ ఎన్ సీఆర్, ముంబైలలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు సిద్దమవుతుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది. 

రిటైల్ స్టోర్లలో బిజినెస్ ప్రో, బిజినెస్ ఎర్స్ పర్ట్, ఆపరేషన్స్ ఎక్స్ పర్ట్, టెక్నికల్ స్పెషలిస్టులతో సహా ఇతర సిబ్బందిని నియమించుకోనుంది.  పార్ట్ టైం, ఫుల్ టైం ఫార్మాట్లతో  ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పిస్తోంది. 

Also Read :- అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు

కొత్తగా ప్రారంభించే నాలుగు రిటైల్ స్టోర్లలో మొత్తం 400 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. రిక్రూట్ మెంట్ కు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ ను Apple  కేరీర్ వెబ్సైట్లో ఉంచింది.