న్యూఢిల్లీ: మార్కెట్ లో కుప్పులుతెప్పలుగా ఎన్ని మొబైల్ బ్రాండ్లు వస్తుప్పటికీ తన ప్రత్యేకతను కాపాడుకోవడంలో యాపిల్ కంపెనీ సక్సెస్ అవుతోంది. అందుకే యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఆ సంస్థ తయారీ చేసే ఫోన్లకు అంత గిరాకీ ఉంటుంది. యూజర్లు కూడా యాపిల్ నుంచి కొత్త ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. యాపిల్ నుంచి త్వరలో రాబోతున్న ఐఫోన్ 12 పై కూడా వినియోగదారుల్లో చాలా ఆసక్తి ఉంది. ఈ ఏడాది యాపిల్ నాలుగు ఐఫోన్ మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకురానుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఐఫోన్ 12 ధర, ఫీచర్లకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.
ఐఫోన్11 సిరీస్ కంటే ధర తక్కువేనా?
మై డ్రైవర్స్ అనే చైనీస్ బ్లాగ్ సైట్ ప్రకారం.. 5.4 ఇంచుల ఓఎల్ ఈడీ డిస్ ప్లే మోడల్ ఐఫోన్ 12 అప్ కమింగ్ సిరీస్ ఫోన్ల ధర సుమారుగా 649 డాలర్లు (రూ.49,231) ఉండొచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 11 లాంచ్ చేసినప్పుడు ప్రారంభ ధర 699 డాలర్లు (సుమారు రూ.53 వేలు). ఒకవేళ ఈ రిపోర్ట్ వెల్లడించింది నిజమైతే ఐఫోన్ 12 సిరీస్ ఐఫోన్ 11 సిరీస్ కంటే తక్కువకే వస్తోందని చెప్పొచ్చు. రాబోయే ఐఫోన్ 12 మోడల్ గురించి కూడా రిపోర్ట్ మరికొన్ని వివరాలను చైనీస్ బ్లాగ్ చెప్పింది. 6.1 అంగుళాల ఓఎల్ ఈడీ స్క్రీన్ మోడల్ సిరీస్ లో డ్యుయల్ కెమెరాలు ఉంటాయని, ధర 749 డాలర్లు (దాదాపు రూ.56,659) ఉండొచ్చని తెలిపింది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఐడీఏఆర్ సెన్సార్స్ ఉన్న ఫోన్ 1,000 డాలర్లు (రూ.75,655 సుమారుగా) ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే ఐఫోన్ 12 టాప్ మోడల్ 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉండి.. ఎల్ డీఏఆర్ సెన్సార్స్ ఉంటుందని, ప్రైస్ దాదాపుగా 1099 డాలర్లు (సుమారుగా రూ.83,337) ఉంటుందని తెలిపింది. ఐఫోన్ 12 ప్రొలో అదనంగా స్రీన్ రీఫ్రెష్ రేట్ 120హెచ్ జెడ్, యూఎస్ బీ టైప్–సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉంటాయని వివరించింది. దీంట్లో రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఉండే అవకాశం ఉండొచ్చని పేర్కొంది.