I Phone 15 కావాలా.. ఆన్ లైన్ లో ఇలా బుక్ చేసుకోండి.. ధరల వివరాలు ఇవే..

I Phone 15 కావాలా.. ఆన్ లైన్ లో ఇలా బుక్ చేసుకోండి.. ధరల వివరాలు ఇవే..

Apple..ఇటీవల నాలుగు కొత్త మోడల్స్ ఐఫోన్ 15(iPhone 15),ఐఫోన్ 15 ప్రో(iPhone 15 Pro), యాపిల్ వాచ్ 9(Apple Watch 9), ఎయిర్ పోడ్స్( AirPods Pro 2nd version) ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ రోజు (సెప్టెంబర్ 15న) నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. శుక్రవారం (సెప్టెంబర్ 15) సాయంత్రం 5.30 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబైలో ఐఫోన్ 15 సీరిస్ లే అవుట్లను ప్రారంభించింది. 

Also Read : పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు: నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి

కొత్త ఐఫోన్లను పొందాలనుకువారు యాపిల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. ఫ్లిప్ కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ప్రముఖ రిటైర్లను ఎంచుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి స్టోర్ల ద్వారా ఈ కొత్త ఐఫోన్ల అమ్మకాన్ని ప్రారంభిస్తుంది యాపిల్.

ఐఫోన్ 15 సిరీస్  అనేక రంగుల్లో అందుబాటులో ఉంది.  వివిధ స్టోరేజ్ కెపాసిటీల్లో లభిస్తున్నాయి. 

ఐఫోన్ 15 సిరీస్ ధరలు : 

ఐఫోన్ 15 (iPhone 15):
128GB - రూ. 79,900
256GB - రూ. 89,900
512GB - రూ. 1,09,900

నీలం, గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 


ఐఫోన్ 15 ప్లస్:
128GB - రూ. 89,900
256GB - రూ. 99,900
512GB - రూ. 1,19,900

నీలం, గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 
28GB - రూ. 1,34,900
256GB - రూ 1,44,900
512GB - రూ. 1,64,900
1TB - రూ. 1,84,900

సహజ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం రంగుల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంది 

iPhone 15 Pro Max:
256GB - రూ. 1,59,900
512GB - రూ. 1,79,900
1TB - రూ. 1,99,900

రంగులు: సహజ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం

ఐఫోన్‌లతో పాటు ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ ప్రో 2లను కూడా పోటీ ఆకర్షణీయమైన ధరతో పరిచయం చేసింది.

యాపిల్ వాచ్ అల్ట్రా 2 : రూ. 89,900
AirPods ప్రో 2nd Version: రూ. 24,900

ఇంకా కొత్తగా ప్రారంభించబడిన Apple Watch Series 9 వివిధ రకాలైన మోడళ్లలో ప్రత్యేకతలతో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ.41,900 నుంచి రూ.75,900 వరకు ఉన్నాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 9 పింక్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, సిల్వర్, రెడ్, గోల్డ్ సిల్వర్, గ్రాఫైట్ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.