ఐ ఫోన్ కస్టమర్లకు అలర్ట్ : పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్స్ జరగొచ్చు

ఐ ఫోన్ కస్టమర్లకు అలర్ట్ : పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్స్ జరగొచ్చు

మీరు ఐ ఫోన్. (iPhone) కస్టమర్లా.. ఐ ఫోన్ వాడుతున్నారా.. బీకేర్ ఫుల్.. మీ ఫోన్లలో కొత్త వైరస్ ఎటాక్ జరిగే ప్రమాదం ఉంది.. అది ఎలాంటిది అంటే పెగాసస్ స్పైవేర్ లాంటి నిఘా సాఫ్ట్ వేర్ అన్నమాట.. ఆ స్పైవేర్ మీ ఐ ఫోన్లు టార్గెట్ గా ఉందని.. దీని వల్ల మీ డేటాకు.. మీ వ్యక్తిగత సమాచారం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం.. మీ ఐ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని యాపిల్ కంపెనీ హెచ్చరించింది.

యాపిల్ మొబైల్ యూజర్లకు బిగ్ షాక్.. ఐ ఫోన్ కంపెనీ ఇండియాతోపాటు 97 దేశాలకు అలెర్ట్ జారీ చేసింది. ఆపిల్ మొబైల్స్ హాక్ అయ్యే అవకాశం ఉందని ఐఫోన్ కంపెనీ ప్రకటించింది. పటిష్ఠమైన భద్రత కలిగిన iOS ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా పెగాసెస్ లాంటి మెర్సినరీ స్పైవేర్ అటాక్ చేయగలదట. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, సమృద్ధ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పుష్పరాజ్ దేశ్‌పాండే మైక్రోబ్లాగింగ్ సైట్ ఫోన్లకు ఈ అలెర్ట్ వచ్చింది. వారి ఈ విషయాన్ని Xలో  షేర్ చేసుకున్నారు. మెర్సినరీ స్పైవేర్ చాలా ప్రమాదరమైనది. అత్యాధునికమైనదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.  మెర్సినరీ స్పైవేర్ అటాక్ సైబర్‌క్రిమినల్ యాక్టివిటీ లేదా కన్స్యూమర్ మాల్‌వేర్ కంటే చాలా అధునాతనమైనవి.

Also Read :భారత్​ వదిలి వెళ్లనున్న 4 వేల 300 మంది కోటీశ్వరులు
 

ఈ దాడులు NSO గ్రూప్ యొక్క పెగాసస్ లాగే ప్రమాదకరమైనవిగా గుర్తించారు. మెర్సినరీ స్పైవేర్ డివైస్ లోని మీ మొత్తం డేటా, కార్యకలాపాలను హ్యాక్ చేసే హ్యాకర్స్ చేతిలో పెడుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా టెక్ దిగ్గజం NSO గ్రూప్ నుండి పెగాసస్ వంటి మెర్సినరీ స్పైవేర్ ని ఉపయోగించి లక్ష్యంగా చేసుకుంది. దీంతో జూలై 11న యాపిల్ ఫోన్ యూజర్లకు నోటిఫికేషన్‌లను పంపింది. యూజర్ యొక్క Apple IDతో అటాచ్ చేసిన ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్‌లకు Apple ఇమెయిల్ మరియు iMessage నోటిఫికేషన్‌ను పంపుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఎంతమందికి ఈ అలెర్ట్ మెస్సెజ్ లు వచ్చాయో స్పష్టంగా తెలియదు.