iPhone 16e వచ్చేసిందోచ్..ధర, ఫీచర్లు ఇవిగో

iPhone 16e వచ్చేసిందోచ్..ధర, ఫీచర్లు ఇవిగో

ఆపిల్ అధికారికంగా ఐఫోన్ 16E ని విడుదల చేసింది. ఇది తక్కువ ధరలో  ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఐఫోన్లకోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఇది మంచి ఎంపిక. ఈ డివైజ్ 6.1-అంగుళాల డిస్ ప్లే, నాచ్ డిజైన్ ,శక్తివంతమైన 48MP కెమెరాను కలిగి ఉంది.

Apple iPhone 16E ధర,లభ్యత

iPhone 16e  బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. ప్రీ-ఆర్డర్‌లు శుక్రవారం (ఫిబ్రవరి 21 )ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.  iPhone 16e వైట్ , నలుపు రంగులలో 128GB, 256GB , 512GB స్టోరేజ్ లతో లభిస్తుంది. దీని ధర రూ.59వేల 900 నుంంచి ప్రారంభమవుతుంది. 

Apple iPhone 16E: ముఖ్య లక్షణాలు

ఐఫోన్ 16E డివైజ్.. అల్యూమినియం ఫ్రేమ్,శక్తివంతమైన సొగసైన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, మినిమలిస్ట్ డిజైన్‌కు Apple ప్రసిద్ధి చెందింది. భద్రతకోసం లేటెస్ట్ ఫేస్ ID టెక్నాలజీ కలిగి ఉంది. iPhone 16e యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది. ఇది కస్టమర్లు కేవలం ఒక ప్రెస్‌తో వివిధ రకాల ఫంక్షన్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

iPhone 16E  ప్రత్యేక లక్షణాలలో 48MP ప్రధాన కెమెరా ఒకటి. ఇది మునుపటి బడ్జెట్ మోడల్‌ల ఐఫోన్లనుంచి అప్డేట్ చేయబడింది.  అధిక-రిజల్యూషన్ సెన్సార్ షార్ప్ ఫొటోస్, లో లైట్ సామర్థ్యం, ప్రొఫెషనల్-క్వాలిటీ ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. అదనంగా కెమెరా సిస్టమ్ స్మార్ట్ HDR ,నైట్ మోడ్ వంటి లేటెస్ట్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. షూటింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

iPhone 16e Apple తాజా జనరేషన్ A18 చిప్ ద్వారా పనిచేస్తుంది. ఇది వేగంగా, స్మార్ట్ పనితీరును అద్భుతమైన శక్తి సామర్థ్యం, Apple ఇంటెలిజెన్స్‌ని అనుమ తిస్తుందని Apple తెలిపింది.