న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారి కంపెనీ యాపిల్‌కు ఇండియా బిజినెస్ నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,745.7 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ప్రాఫిట్ రూ.2,229.6 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం 36 శాతం వృద్ధి చెంది రూ.49,321.8 కోట్ల నుంచి రూ.67,121.6 కోట్లకు ఎగిసింది. ఈ వివరాలను యాపిల్ రెగ్యులేటరీ ఫైలింగ్ డేటా ఆధారంగా టోఫ్లెర్ బయటపెట్టింది. ఒక్కో ఫుల్లీ పెయిడప్ షేరుకి రూ.9.43 లక్షల డివిడెండ్‌ను యాపిల్ ఇండియా ప్రకటించింది. మొత్తం రూ.3,302 కోట్ల విలువైన 35,002 పెయిడప్ షేర్లు ఉన్నాయి.