సెర్చ్ ఇంజిన్‌ను తీసుకొచ్చే యత్నాల్లో యాపిల్!

సెర్చ్ ఇంజిన్‌ను తీసుకొచ్చే యత్నాల్లో యాపిల్!

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్ సెర్చ్ ఇంజిన్‌ను తీసుకు రానుందని సమాచారం. కాలిఫోర్నియా కేంద్రంగా ప్రధాన కార్యకలాపాలు సాగించే యాపిల్ తన సొంత సెర్చ్ ఇంజిన్‌ తయారీపై తీవ్రంగా పని చేస్తోందని తెలిసింది. దీని కోసం అవసరమైన ఆర్టిఫిషియల్ ఎక్స్‌పర్ట్స్‌, సెర్చ్ ఇంజినీర్స్‌ను యాపిల్ రిక్రూట్ చేసుకుంటోందని తెలుస్తోంది. రిపోర్ట్స్‌ ప్రకారం.. తమ ప్రొడక్ట్స్‌లో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా వాడుకుంటున్నందుకు గాను యాపిల్‌కు గూగుల్‌ కొన్నేళ్లుగా పేమెంట్స్ చేస్తోంది. ఐఫోన్, ఐపాడ్‌తోపాటు మ్యాక్ యూజర్లు సఫారీ బ్రౌజర్ యూజ్ చేసేటప్పుడు గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌ను వాడుతున్నారు. యూజర్లు డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ ప్రిఫరెన్సెస్‌ను మార్చనంత వరకు గూగుల్‌ను వాడొచ్చు. ఒకవేళ యాపిల్ తన సొంత సెర్చ్ ఇంజిన్‌ను తీసుకొస్తే అది కొంత డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. యాడ్స్ చూయించకుండా, డేటా మైనింగ్‌కు ఆస్కారం లేకుండా ఈ సెర్చ్ ఇంజిన్ రూపొందే అవకాశం ఉందని సమాచారం. ప్రొఫెషనలైజ్డ్‌ డేటా హబ్‌గా దీన్ని తయారు చేస్తున్నారని తెలుస్తోంది.