తగ్గిన ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ రేట్లు

తగ్గిన ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ రేట్లు

మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ లోకి ఇటీవలే అడుగుపెట్టింది యాపిల్. ఇండియన్ మార్కెట్, యూజర్లను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్యాక్ లను తగ్గించింది ఈ సంస్థ. ఇప్పటికే ‘యూట్యూబ్ మ్యూజిక్’, ‘స్పోటి ఫై’ వంటి సంస్థలు గట్టి పోటీ ఇస్తుండటాన్నిదృష్టిలో పెట్టుకుని ధరల్ని నిర్ణయించింది. నెలకు రూ.99లకే సబ్ స్ర్కిప్షన్ అందిస్తోంది. విద్యార్థులకైతే 49 రూపాయలకే నెలవారీ ప్యాకేజ్ ఇస్తోంది. రూ.149కి ఫ్యామిలీ ప్లాన్అందిస్తోంది. ఇంతకుముందు నెలకు రూ.120, విద్యార్థులకైతే రూ.60, ఫ్యామిలీ ప్లాన్ అయితే రూ.190గా ఉండేది. ఫ్యామిలీప్యాక్ ని ఆరుగురు వాడుకోవచ్చు. ఫ్యామిలీ ప్యాక్ లో ‘ఐట్యూన్స్’ కూడా షేర్ చేసుకోవచ్చు.

ఇటీవలే జియో సావన్‌, గానా యాప్స్ తమ రేట్లు తగ్గించడంతో యాపిల్ కూడా దిగిరాక తప్పలేదు. ప్రస్తుతం ‘జియో సావన్‌’ యాన్యువల్ సబ్ స్క్రిప్షన్ రూ.299 ఉండగా, ‘గానా’ సబ్ స్క్రిప్షన్ రూ.298గా ఉంది. వీటి నెలవారీ ప్లాన్లు కూడా రూ.99 నుంచి ప్రారంభమవుతున్నాయి . స్పోటి ఫై ప్లాన్స్ రూ.119 నుంచి ప్రారంభమవుతుండగా, ఒక నెల ఉచిత ట్రయల్ ప్యాక్ అందిస్తోంది. వివిధ యాప్స్ మధ్య నెలకొన్న పోటీ మూలంగా తక్కువ ధరకే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి .