యాపిల్ నుంచి కొత్తగా..!

యాపిల్ నుంచి కొత్తగా..!

‘యాపిల్’ నుంచి కొత్త ఫోన్ రిలీజవుతుందంటే గ్యాడ్జెట్ ప్రియులకి పండుగే. ఎప్పుడు కొత్త ఫోన్ లాంచవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇందుకు తగ్గట్లే ప్రతి ఏడాది సరికొత్త మోడల్స్ ని యాపిల్ విడుదల చేస్తోంది. ఈ ఏడాది కూడా యాపిల్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ కానున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

పర్సనలైజ్డ్ గ్యాడ్జెట్లలో యాపిల్ ది ప్రత్యేకస్థానం. ఈ సంస్థ నుంచి ఐ ఫోన్, ఐ పాడ్, మ్యాక్ బుక్, స్మార్ట్ వాచ్, ఎయిర్ పాడ్స్ వంటి ప్రోడక్టులు మార్కెట్లో ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిలో కొత్త మోడల్స్ ని విడుదల చేస్తోంది. ఈ ఏడాది యాపిల్ నుంచి పదికిపైగా గ్యాడ్జెట్స్ విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. వాటిలో మూడు ఐ ఫోన్స్, ఐ ప్యాడ్స్, రెండు ఎయిర్ పాడ్స్ వంటివి ఉన్నాయి.

 

మ్యాక్ బుక్ ప్రొ
పూర్తి కొత్త డిజైన్ తో మ్యాక్ బుక్ ప్రొను విడుదల చేయనుంది యాపిల్. 16 నుంచి 16.5 అంగుళాల వరకు స్క్రీన్ సైజ్ ఉండే అవకాశం ఉంది. 2012లో విడుదలైన మ్యాక్ బుక్ ప్రొ 17 అంగుళాల తెర కలిగి ఉండేది. మళ్లీ ఇప్పుడు దాదాపు అంతే పెద్ద తెరతో కొత్త మోడల్ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్స్ 13, 15 అంగుళాల స్క్రీన్ మాత్రమే కలిగి ఉన్నాయి

 

మానిటర్
చాలా కాలం క్రితమే యాపిల్ సంస్థ మానిటర్ల అమ్మకాల్ని ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ మానిటర్లను విక్రయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే 31.6 అంగుళాల తెర కలిగిన 3కె, 6కె మానిటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సరికొత్త డిజైన్ తో ఇవి విడుదల కానున్నాయి.

 

ఎయిర్ పాడ్స్ 2
యాపిల్ నుంచి విడుదలైన వైర్ లెస్ ఇయర్ బడ్స్ ‘ఎయిర్ పాడ్స్’. వీటికి అప్ డేటెడ్ వెర్షన్ గా రానున్నాయి ఎయిర్ పాడ్స్ 2. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎయిర్ పాడ్స్ వైట్ కలర్ లో ఉంటే, ఎయిర్ పాడ్స్ 2 బ్లాక్ కలర్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిని ఐ ఫోన్, మ్యాక్ బుక్, ఐ ప్యాడ్, స్మార్ట్ వాచ్ లతో కనెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ ‘హే సిరి ’ మోడ్ లో కూడా పని చేస్తాయి. వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదలవ్వొచ్చు.

 

ఐ ప్యాడ్ మినీ
ఫిఫ్త్​జెనరేషన్ ఐ ప్యాడ్ మినీ కొత్త వెర్షన్ తో, అదనపు ఫీచర్లతో విడుదల కానుంది. డిజైనింగ్ మాత్రం పాత ఐ ప్యాడ్ మినీలాగే ఉండనుంది. స్క్రీన్ సైజు 7.9 అంగుళాలు ఉంటుంది. హెడ్ ఫోన్ జాక్, టచ్ ఐడి, స్మార్ట్ కీ బోర్డ్, యాపిల్ పెన్సిల్ వంటి అదనపు ఫీచర్లుంటాయి.

 

యాపిల్ వాచ్ 5
గత ఏడాది విడుదలైన యాపిల్ వాచ్ సిరీస్ 4 మంచి సక్సెస్ సాధించింది. దానికి అప్ డేటెడ్ వెర్షన్ యాపిల్ వాచ్ సిరీస్ 5 ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ స్మార్ట్ వాచ్ సిరామిక్ కేసింగ్ డిజైన్ తో రానుంది. ఈసీజీ లాంటి ఫీచర్లు
దీనిలోనూ ఉంటాయి.

 

ఐప్యాడ్ ప్రొ
యాపిల్ నుంచి రెం డు ఐ ప్యాడ్ ప్రొ కొత్త మోడల్స్ విడుదల కానున్నాయి. కొత్త ఐ ప్యాడ్ ప్రొలు మరింత పెద్ద తెర కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఐ ప్యాడ్ 9.7 అంగుళాల తెరతో ఉంటే, కొత్తవి10.2 అంగుళాల స్క్రీన్ తో రానున్నాయి. ఇవి పాత వాటితో పోలిస్తే చాలా సన్నగా, తక్కువ బరువుతో ఉంటాయి. వీటికి కొత్త ప్రాసెసర్ ను వాడుతున్నారు.

 

ఎయిర్ పవర్ మ్యాట్
యాపిల్ వైర్ లెస్ చార్జింగ్ డివైస్ ‘ఎయిర్ పవర్ మ్ యాట్’. దీనితో యాపిల్ స్మార్ట్ వాచ్, ఐ ఫోన్స్, ఐ ప్యాడ్స్.. ఇలా యాపిల్ ప్రోడక్స్ట్ అన్నిం టినీ ఒకేసారి చారిం్జ గ్ చేసు కోవచ్చు. ఐ ఫోన్ ఎక్స్ లాం చ్ లో దీన్ని ఆ సంస్థ ప్రదర్శించింది. ఈ ఏడాది ప్రథమార్థం లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.