యాపిల్ ఆఫీస్ నెల అద్దె రూ.2.43 కోట్లు.. 750 కార్లకు పార్కింగ్

యాపిల్ ఆఫీస్ నెల అద్దె రూ.2.43 కోట్లు.. 750 కార్లకు పార్కింగ్

యాపిల్ కంపెనీ.. భూమిపై అత్యంత విలువైన సంస్థ ఇది.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేటివ్ ఆఫీసును.. బెంగళూరులో ఓపెన్ చేసింది. ఈ ప్రత్యేకతలు చూస్తే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే.. అవేంటో చూద్దాం...

>>> బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న కుబ్బాన్ రోడ్డులోని ప్రస్టేజ్ ఎస్టేట్ బిల్డింగ్ లోని 15 అంతస్తులను లీజుకు తీసుకున్నది యాపిల్ సంస్థ.
>>> ఈ బిల్డింగ్ అద్దె నెలకు అక్షరాల 2 కోట్ల 43 లక్షల రూపాయలు.
>>> 12 వందల మంది ఉద్యోగులు పని చేయటానికి వీలుగా ఆఫీస్ స్పేస్ ఉంది.
>>> 740 కార్లకు పార్కింగ్ స్పేస్ లీజుకు తీసుకున్నది. దీని కోసం నెలకు 16 లక్షల 56 వేల రూపాయలు అద్దె చెల్లిస్తుంది యాపిల్ సంస్థ.
>>> మొత్తం ఆఫీస్ స్పేస్ ఒక లక్షా 16 వేల SFT.. ఒక్కో స్కైర్ ఫీట్ కు 195 రూపాయలు చెల్లిస్తుంది.
>>> మొత్తం 10 సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్ రాసింది యాపిల్ కంపెనీ.
>>> యాపిల్ కంపెనీ ల్యాబ్ స్పేస్, బిజినెస్ డీల్ డిస్కషన్, వెల్ నెస్ జోన్, ఫుడ్, టీ, కాఫీ, కస్టమర్లతో డిస్కషన్ వంటి వాటికి ప్రత్యేకంగా స్పేస్ కేటాయించారు. ఆఫీస్ మొత్తం ఆటోమేటిక్ వెర్షన్ లో ఉంది. వాయిస్ కంట్రోల్ తో ఆపరేట్ చేయొచ్చు.
>>> ఆఫీస్ అంటే ఆఫీసులా కాకుండా.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన డిజైన్ తో.. ఇన్నోవేటివ్ గా.. ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ.. ఆఫీస్ లో ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కల్పించింది యాపిల్ సంస్థ.
>>> బెంగళూరులోని ఆఫీస్ నుంచి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సేవలు, సెక్యూరిటీ వంటి సేవలను అందిస్తుంది.

యాపిల్ బెంగళూరు కొత్త ఆఫీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంత అత్యద్భుతమైన ఆఫీస్ లుక్ ఇండియాలో ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఉద్యోగుల సౌకర్యాలు, జీతాల విషయంలో యాపిల్ నెంబర్ వన్ కంపెనీగా.. కొన్నేళ్లుగా కొనసాగుతుంది.