ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్సర్వీస్లోకి యాపిల్ కూడా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘యాపిల్ టీవీ ప్లస్’ పేరుతో రానున్న ఈ సర్వీస్ లు వచ్చే నవంబర్‌నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా కొన్ని సెలెక్టెడ్ షోలను మాత్రమే అందుబాటులో ఉంచనున్న యాపిల్ ఆ తర్వాత భారీస్థాయిలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టనుంది. యాపిల్ ఓటీటీ (ఓవర్ ది టాప్) సర్వీస్ మొదలైతే ‘నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో’లకు గట్టి పోటీ ఉండబోతుంది.
మరికొద్ది రోజుల్లో ‘వాల్ట్ డిస్నీ, ఎటీ అండ్ టీ, ఎన్బీసీ యూనివర్సల్’ వంటి సంస్థలు కూడా ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తాయి. భవిష్యత్తులో కేబుల్ టీవీకన్నా ఆన్లైన్లోనే ఎంటర్టైన్మెంట్ చూసే అవకాశం ఉండటంతో పెద్ద కంపెనీలు దీనిపై దృష్టిపెడుతున్నాయి.