ఐఫోన్ యూజర్లు పండగ చేస్కోండి.. కాల్ రికార్డింగ్​ ఎలా చేయాలంటే..

ఐఫోన్ యూజర్లు పండగ చేస్కోండి.. కాల్ రికార్డింగ్​ ఎలా చేయాలంటే..

ఐఫోన్ కస్టమర్ల కోసం ఐఒఎస్​ 18.1 అప్​డేట్​ను రిలీజ్​ చేసింది. ఈ అప్​డేట్​లో ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఇప్పటివరకు ఐఫోన్​లో కాల్ రికార్డింగ్​ చేయడానికి వీలు ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఈ కొత్త అప్​డేట్​తో ఇకపై కాల్ రికార్డ్ చేయొచ్చు. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ ప్రస్తుతం ఐ ఫోన్​ 16 యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఐ ఫోన్​లో కాల్ రికార్డింగ్​ ఎలా చేయాలంటే.. ముందుగా మీ డివైజ్​లో లేటెస్ట్​ ఐఒఎస్​ 18.1 అప్​డేట్​ను ఇన్​స్టాల్ చేయాలి. ఫోన్​ను అప్​డేట్​ చేయడానికి, సెట్టింగ్​లకు వెళ్లి, ఆపై సాఫ్ట్​వేర్​ అప్​డేట్ అనే ఆప్షన్​ మీద క్లిక్ చేయాలి. అలా ఫోన్​ అప్​డేట్ చేశాక మాత్రమే రికార్డ్ చేసే వీలుంటుంది. 

ఫోన్​ కాల్ లిఫ్ట్​ చేశాక ఎడమ వైపు ఒక గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాక, కంటిన్యూ చేయాలి. కాల్ మాట్లాడడం పూర్తయ్యాక స్క్రీన్​పై పాప్​–అప్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి రికార్డింగ్ వినొచ్చు.  రికార్డింగ్ ఎప్పుడైనా వినాలనుకుంటే వాయిస్ నోట్స్​లో సేవ్​ అయి ఉంటాయి.

ALSO READ : ఐప్యాడ్​, ఆండ్రాయిడ్​ ఫోన్, కంప్యూటర్​.. అన్నింటికీ ఒకే పెన్​డ్రైవ్​ వాడొచ్చు..!

అంతేకాకుండా.. మీ ఫోన్​లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉంటే రియల్​ టైం ట్రాన్స్​క్రిప్షన్​ కూడా పొందొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంగ్లీష్​, ఫ్రెంచ్, స్పానిష్​, జపనీస్, జర్మన్, మాండరీన్, పోర్చుగీస్, కాంటోనీస్ భాషల్లో అందుబాటులో ఉంది. ట్రాన్స్​క్రిప్షన్​ ఫీచర్​ను ఎనేబుల్ చేయాలంటే.. ఫోన్​ సెట్టింగ్స్​కు వెళ్లాలి. తర్వాత సెర్చ్​ బార్​లో లైవ్ వాయిస్ మెయిల్​ ఆప్షన్​ను ఆన్ చేయాలి.