ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరించే పండ్లలో యాపిల్ పండు మొదటి వరుసలో ఉంటుంది. రోజుకొక యాపిల్ తింటే అసలు డాక్టర్ అవసరమే ఉండదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెబుతుంటారు. కానీ యాపిల్ లోపల ఉండే విత్తనాల గురించి ప్రస్తావన వస్తే మాత్రం చాలా మంది భయపడతారు. దీనికి కారణం యాపిల్ విత్తనాలలో విషముంటుందని, వాటిని తింటే చచ్చిపోతారని. అసలు యాపిల్ విత్తనాలలో విషం ఉంటుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?
యాపిల్ ఆరోగ్యానికి మంచి పండుగా చెబుతారు. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదనే ఇంగ్లీష్ సామెత కూడా ఉంది. యాపిల్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, యాపిల్ గింజల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధమని కొందరు తరచూ చెబుతూ ఉంటారు. యాపిల్ గింజలు విషపూరితమైనవనీ, వాటిని ఎక్కువగా తింటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు.
యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే యాపిల్ పండ్లలో ఉండే విత్తనాలు(Apple seeds) ప్రాణానికి ప్రమాదం కలిగిస్తాయని చెబుతారు. యాపిల్ విత్తనాలలో సైనైడ్(cyanide) ఉంటుంది. సైనైడ్ అనేది విషం(poison). దీనికారణంగా ఈ విత్తనాలు పొరపాటున కడుపులోకి వెళితే చనిపోతారని అంటారు. అయితే యాపిల్ విత్తనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోమని వైద్యులు చెబుతున్నారు. సైనైడ్ ను సాధారణంగా యుద్ద రసాయనంగా ఉపయోగిస్తుంటారు. అనేక ఆహార పదార్థాలలో సైనోగ్లైకోసైడ్స్ అనే సైనైడ్లు ఉంటాయి. చాలా రకాల పండ్లలో కూడా సైనైడ్ ఉంటుంది. యూపిల్ గింజలలో సైనైడ్లలో ఒకటైన అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది.
యాపిల్ ను తిన్నప్పుడు ఎవరైనా పొరపాటున యాపిల్ విత్తనాలు తినేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాపిల్ విత్తనాల మీద పొర చాలా దృఢంగా ఉంటుంది. ఇది కడుపులోకి నేరుగా వెళితే జీర్ణం కాదు. మలవిసర్జనలో బయటకు వెళ్ళిపోతుంది. కానీ యాపిల్ విత్తనాలను ఎక్కువగా మింగడం లేదా కనీసం ఒక్క విత్తనాన్ని అయినా నమిలి తినడం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అమిగ్డాలిన్ జీర్ణక్రియలో చేరి ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది.
అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, 70 కేజీల వ్యక్తికి.. ప్రతి కేజీ బరువులో 1-2 mg సైనైడ్ ఉంటే, అది చాలా హానికరం. చాలా యాపిల్స్‌లో సగటున 5 గింజలు ఉంటాయి. CDC సిఫార్సు చేసిన హానికరమైన మోతాదులో సైనైడ్.. శరీరంలోకి రావాలంటే... ఒక వ్యక్తి 200 మెత్తగా పిండిచేసిన యాపిల్ విత్తనాలను తినవలసి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి శరీరంపై "ప్రాణాంతక" ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల యాపిల్ తినే సమయంలో పొరపాటున ఒకటి రెండు గింజలు పొట్టలోకి చేరితే, వాటిని నమలకుండానే మింగి ఉంటే ఎలాంటి హానీ ఉండదు. కానీ ఈ గింజలు కంటిన్యూగా తింటూ ఉంటే... క్రమంగా గుండె, మెదడు దెబ్బతినడం ప్రారంభమవుతుంది.. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి యాపిల్ పండు తింటున్నారా.. మరి విత్తానాలు బయటపడేసి తినండి...