
ఐఫోన్.. యాపిల్ ఫోన్.. పిచ్చ పిచ్చగా కొంటున్న ఇండియన్స్.. ఫోన్ అంటే ఐ ఫోన్ అన్నట్లు ఎగబడి కొంటున్నారంట.. అవును.. ఫోన్ అంటే ఐ ఫోన్ అన్న ఫీలింగ్ కు వచ్చేశారు ఇండియన్స్.. గతంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టి మరీ అమ్మకాలు చేస్తుంది యాపిల్ కంపెనీ.
2025 సంవత్సరం.. మూడు నెలలు.. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో.. ఇండియాలో 30 లక్షల ఐ ఫోన్స్ అమ్మకాలు జరిగినట్లు యాపిల్ కంపెనీ వెల్లడించింది. ఇది రికార్డ్ అని.. గత రికార్డులు అన్నీ బద్దలు అయ్యాయంటూ హ్యాపీగా అనౌన్స్ చేసింది యాపిల్ కంపెనీ.
గతంలో ఎప్పుడూ ఇంత భారీగా.. ఇంత వేగంగా అమ్మకాలు జరగలేదని కూడా స్పష్టం చేసింది యాపిల్ కంపెనీ. మూడు నెలల్లోనే.. 30 లక్షల ఐ ఫోన్స్ ఇండియాలోనే అమ్మకానికి కారణాలు కూడా వెల్లడించింది కంపెనీ. EMIపై వడ్డీ లేని ఆఫర్, క్యాష్ బ్యాక్ ఆఫర్, ఎక్చేంఛ్ పాలసీ, ఈ టెల్లర్ డిస్కొంట్స్ వంటి ఆఫర్స్ కారణంగా సేల్స్ గణనీయంగా పెరిగినట్లు చెబుతోంది యాపిల్ కంపెనీ.
Also Read : ఆపిల్‌కి అండగా ఇండియా.. రాత్రికి రాత్రే రూ.16వేల కోట్ల విలువైన ఐఫోన్స్ అమెరికాకు
ఇదే సమయంలో శాంసంగ్, వివో స్మార్ట్ ఫోన్ల సేల్స్ తగ్గగా.. యాపిల్, ఒప్పో, రియల్ మీ స్మార్ట్ ఫోన్ల సేల్స్ పెరిగాయి. ఇండియాలో యాపిల్ కంపెనీ సేల్స్ వాటా 36 శాతానికి పెరిగి.. నాలుగో స్థానంలో ఉంది. 2025 మొదటి మూడు నెలల్లో.. యాపిల్ ఫోన్ల సేల్స్ పెరగటానికి కారణం ఐఫోన్ 16e, 16 సిరీస్ అని స్పష్టం చేసింది. ఐఫోన్ 16e బడ్జెట్ ఫోన్ గా.. 60 వేల రూపాయల్లోనే లభిస్తుండటంతో.. ముఖ్యంగా మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాలు ఐఫోన్ వైపు మొగ్గు చూపారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ బాగా కనెక్ట్ అయ్యాయని.. ఐఫోన్ 16e అమ్మకాలు పెరగటంతోనే.. మొదటి మూడు నెలల్లోనే 30 లక్షల ఐఫోన్లను ఇండియాలో అమ్మగలిగాం అంటూ చెప్పుకొచ్చింది యాపిల్ కంపెనీ.
ఇదే రకంగా సేల్స్ కొనసాగితే.. 2025 ఏడాదిలో ఇండియాలో ఐఫోన్ సేల్స్ 13 నుంచి 14 మిలియన్స్ గా.. అంటే కోటి 30 లక్షల ఐఫోన్ సేల్స్ జరగొచ్చని అంచనా వేస్తుంది యాపిల్ కంపెనీ. జనం దగ్గర డబ్బులు లేవు అనే మాట ఉత్తిదే అని ఐఫోన్ సేల్స్ ద్వారా స్పష్టం అయ్యింది..