ఇండియాలోకి ఆపిల్ విజన్ ప్రో.. ఫోటోలు వైరల్..

ఇండియాలోకి ఆపిల్ విజన్ ప్రో.. ఫోటోలు వైరల్..

ఆపిల్ విజన్ ప్రో ప్రస్తుతం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న పరికరం. టెక్నాలజీ అనేది ఎంత పెరిగిందనేది ఆపిల్ విజన్ ప్రో ను చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో లాంచ్ అయిన ఈ పరికరం ఇంకా భారతదేశ మార్కెట్ లోకి మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే బెంగళూరులో తీసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  ఒక యువకుడు బెంగళూరు రోడ్లపై విజన్ ప్రోతో కనిపించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ఆపిల్ విజన్ ప్రోను ధరించి బెంగళూరు రోడ్లపై తిరుగుతున్న యువకుడి ఫోటో వైరల్ అయ్యింది.

 బెంగళూరులోని ఇందిరానగర్ లో వరుణ్ మయ్య అనే వ్యక్తి టెక్కీ విజన్ ప్రోతో నడుస్తూ కనిపించాడు. అతన్ని ఫోటో తీసిన ఓ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముందు క్షణాల్లోనే వైరల్ గా మారింది. బెంగళూరులోని వీధుల్లో ఆపిల్ విజన్ ప్రోతో యువకుడు ఆడుకుంటున్నాడని క్యాప్షన్ ఇచ్చారు. విజన్ ప్రో వీధుల్లో కనిపించడంతో త్వరలోనే భారతదేశంలో కూడా ఈ సూపర్ స్మార్ట్ గ్యాడ్జెట్ లాంచ్ కాబోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

ఆపిల్ విజన్ ప్రో కొనాలంటే 2.8 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆకర్షించే అధునాతన ఫీచర్‌లు ఎన్నో ఉన్నాయి. వారి వర్చువల్ అనుభవాలను వాస్తవ ప్రపంచంలోకి తీసుకువెళుతోంది.  

Also Read: గుంటూరు కారం పాటపై రష్మీ ఫైర్.. అలాంటివేం జరగలేదట!