ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ పక్కన పెట్టి పడుకోవడం వల్ల మంటలు, విద్యుదాఘాతం, దాని వల్ల గాయాలు కావడం, ఆస్తి నష్టం వంటి ప్రమాదాల గురించి ఆపిల్ హెచ్చరిక జారీ చేసింది. యూజర్స్ తమ ఫోన్‌లను బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఛార్జ్ చేయాలని, ఆ సమయంలో అసలు అవి ఛార్జ్ అవుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవాలని సూచించింది. పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసిననప్పుడు వాటిని దుప్పట్లు లేదా దిండ్లు కింద ఉంచకుండా ఉండాలని కూడా గట్టిగా సలహా ఇస్తున్నారు.
ఫోన్ ఛార్జింగ్ పెట్టేటపుడు పాటించాల్సిన జాగ్రత్తలను, ప్రాముఖ్యతను ఆపిల్.. తమ యూజర్స్ కు నొక్కి చెప్పింది. ఛార్జింగ్ కేబుల్‌కు కనెక్ట్ చేసినపుడు పక్కనే ఫోన్ పెట్టుకుని నిద్రించడం వల్ల కలిగే నష్టాలను కూడా హైలైట్ చేసింది. ఈ తరహా ప్రమాదాలలో విద్యుత్ షాక్, గాయాలు లేదా ఫోన్, ఆస్తికి నష్టం వాటిల్లడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ప్రమాదాలను నివారించడానికి, మంచి వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో కేబుల్‌కు కనెక్ట్ చేయాలని, ఫోన్‌లు ఛార్జింగ్ అవుతున్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని Apple సూచిస్తోంది.
ఛార్జింగ్ లో ఉన్నపుడు ఫోన్ వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున దుప్పటి లేదా దిండు కింద ఫోన్‌ను పెట్టకూడదని కూడా ఆపిల్ హెచ్చరిక జారీ చేసింది. "పవర్ అడాప్టర్ లేదా వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోకండి. పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసిననప్పుడు వాటిని దుప్పటి, దిండు లేదా మీ శరీరం కింద ఉంచుకోకండి" అని తెలిపింది. ఐఫోన్‌లను పవర్ అడాప్టర్‌లు, వైర్‌లెస్ ఛార్జర్‌లను ఎల్లప్పుడూ బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశాలలో ఉపయోగించాలని లేదా ఛార్జ్ చేయాలని సిఫార్సు చేసింది. థర్డ్-పార్టీ ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా ఆపిల్ ఎత్తి చూపింది. ముఖ్యంగా ఆపిల్ అధికారిక ఉత్పత్తుల ద్వారా భద్రతా ప్రమాణాలు లేని చౌకైన ప్రత్యామ్నాయాలను ఉపయోగకూడదని చెప్పింది. ఈ ప్రమాదాలను నివారించడానికి అంతర్జాతీయ భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండే మేడ్ ఫర్ ఐఫోన్ కేబుల్‌లను ఎంచుకోవాలని ఆపిల్ వినియోగదారులకు సలహా ఇచ్చింది.
USB 2.0 లేదా తర్వాతి ప్రమాణాలకు అనుగుణంగా, సంబంధిత భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండే థర్డ్-పార్టీ కేబుల్స్, పవర్ ఎడాప్టర్‌లను ఉపయోగించి కూడా ఐఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు. కానీ ఇతర అడాప్టర్‌లు ఈ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని, హాని కలిగించే లేదా ప్రమాదాలను కలిగిస్తుందని కంపెనీ వివరిస్తుంది. ఇది నీరు వంటి ఇతర తడిగా ఉన్న ప్రదేశాల్లో ఫోన్‌లను ఛార్జింగ్ చేయడాన్ని నివారించడం అనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. డ్యామేజ్ అయిన ఛార్జర్‌లను వెంటనే తొలగించాలని.. బలహీనమైన కేబుల్‌లు లేదా ఛార్జర్‌లను ఉపయోగించడం లేదా తేమ సమక్షంలో ఛార్జింగ్ చేయడం వలన మంటలు, విద్యుత్ షాక్‌లు, గాయాలు లేదా ఇతర ఆస్తి నష్టం జరగవచ్చు. ఆపిల్ ఇచ్చిన ఈ సలహాలను శ్రద్ధగా అనుసరించి, భద్రతకు ప్రాధాన్యతనిస్తే.. యూజర్స్ తమను, వారి ఫోన్‌లను, వారి పరిసరాలను ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు.