పెగాసస్ తరహాలో స్పైవేర్ దాడులు జరగొచ్చని ఆపిల్ సంస్థ తన ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది.కొంత మంది వ్యక్తులను లేదా గ్రూపులను టార్గెట్ స్పైవేర్ దాడులు జరగొచ్చని ఆపిల్ సంస్థ ఈ మెయిల్స్ పంపింది. ఈ దాడులు సాధారణ సైబర్ నేరాల కంటే చాలా అడ్వాన్డ్స్ అని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్, సఫారీ బ్రౌజర్లలో ఈ థ్రెట్ ను గుర్తించింది. అయితే వినియోగదారులు ఈ స్పైవేర్ నుంచి రక్షించుకోవాలంటే ఏం చేయాలో తెలిపింది.
ఏం జరిగిందంటే..
కొంతమంది ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ హెచ్చరిక ఈమెయిల్స్ పంపింది. వారు అడ్వాన్డ్స్ స్పైవేర్ దాడికి గురి కావచ్చని ఈమెయిల్స్లో తెలిపింది. ఈ స్పైవేర్ పెగాసస్ను పోలి ఉంటుంది. ఈ రకమైన దాడులు చాలా అరుదు.. సాధారణ సైబర్ నేరాలకంటే చాలా ఆధునాతనమైనవని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఎవరిని టార్గెట్ చేశారు
స్పైవేర్ దాడి నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. అంటే ప్రత్యేకించి ఓ వ్యక్తిపై గానీ, ఓ గ్రూప్ పై గానీ నిఘా పెట్టే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది.
వినియోగదారులు ఏం చేయాలి
- వినియోగదారులు తమను తాము రక్షించుకునేందుకు ఆపిల్ కొన్ని సూచనలు చేసింది.
- మీ ఐఫోన్ లోని లాక్ డౌన్ మోడ్ ను ఎనేబుల్ చేయాలి. ఈ ఫీచర్ మీ డివైజ్ యాక్సెస్ ను నియంత్రించి థ్రెట్ నుంచి రక్షిస్తుంది.
మీ ఐఫోన్ ని లేటెస్ట్ సాఫ్ట్ వేర్ వెర్షన్ కి అప్ డేట్ చేయండి. సెక్యూరిటీ పరమైన ప్రాబ్లమ్స్ ను పరిష్కరించేందుకు ఆపిల్ తరుచుగా అప్ డేట్ లను విడుదల చేస్తుంది. కాబట్టి మీ డివైజ్ ను అప్ డేట్ చేయడం చాలా ముఖ్యం.
మార్చి ప్రారంభంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జున్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్, సఫారి వెబ్ బ్రౌజర్ లో అనేక లోపాలను హైలైట్ చేసింది. ఈ లోపాలతో వ్యక్తులను లేదా గ్రూప్ లను టార్గెట్ చేసి డివైజ్ లలో చొరబడి డేటా స్టీల్ వంటి భద్రతా పరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే వీటిని నియంత్రించేందుకు ఆపిల్ కంపెనీ ఆప్ డేటెడ్ వెర్షన్లను అందుబాటులోకి తెస్తుంది.