ఐఫోన్16లో కొత్తగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు..కొనేందుకు ఎగబడుతున్న జనం

ఐఫోన్16లో కొత్తగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు..కొనేందుకు ఎగబడుతున్న జనం

ఐఫోన్ 16లో కొత్తగా ప్రవేశపెట్టిన యాపిల్ ఇంటెలిజెన్స్ లో అనేక ఫీచర్లు ఉండటంతో జనం ఎగబడుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా యాపిల్ కూడా పోన్ డిస్ ప్లే సైజులు పెంచడం, సిరి కమాండ్ ను మరింత బలోపేతం చేయడంతో క్రేజీ బాగా పెరిగింది. 

ప్రూఫ్  రీడింగ్ చేస్తుంది.. తప్పులు దిద్దేస్తుంది!

మెయిల్, నోట్స్, పేజీలు, థర్డ్​ పార్టీ యాప్స్​ సహా ఎక్కడైనా టెక్ట్స్​ని తిరిగి రాయడానికి, ప్రూఫ్ రీడ్ చేయడానికి, సమ్మరైజ్​ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. 

కాల్ రికార్డ్ అయితే నోటిఫికేషన్ 

కాల్​ రికార్డ్​ అయినప్పుడు పార్టిసిపెంట్స్​కి ఆటోమెటిక్​గా నోటిఫికేషన్​ వెళుతుంది. కాల్​ పూర్తైన తర్వాత సమ్మరీని యాపిల్​ ఇంటెలిజన్స్​ జనరేట్​ చేస్తుంది.

ఎమోజీలో కొత్తదనం

మనం మన ఫీలింగ్ ను ఎక్స్ ప్రెస్ చేయడానికి టెక్స్ట్ తో పాటు ఎమోజీలను పంపుతుంటాం. ఇప్పుడు యాపిల్ ఇంటలిజెన్స్ ను జోడించిన తర్వాత అదనపు ఆప్షన్లు మనకు ఇందులో ఉంటాయి. ఎలా అంటే మన ఫ్రెండ్స్, రిలేటీవ్స్ ఫొటోలతో ఎమోజీలు తయారు చేసి వాటిని టెక్స్ట్ చేసే టప్పుడు వాడొచ్చు.. స్టిక్కర్ గా కూడా షేర్ చేసుకోవచ్చు..

హలో సిరీ ఇప్పుడు కొత్తగా..

యాపిల్ యూజర్లకు సిరీతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంకా సిరి ఇంకా మనకు మరింత దగ్గరగా ఉంటుంది. అదెలానంటే.. బిగ్గరగా మాట్లాడలేని సందర్భంలో స్క్రీన్ టచ్ చేస్తే సిరి రెస్పాండ్ అవుతుంది.. పాత విషయాలు గుర్తు చేస్తే సమాధానం ఇస్తుంది. ఆన్ స్క్రీన్ పై సులభంగా సిరితో ఎక్కువ పనిచేయొచ్చు. 

ఇమేజ్ వ్యాండ్

ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు అక్కడేదైనా ఫొటో ఉంటే బాగుండు అని అనుకుంటుంటా. అప్పుడు ఇమేజ్ వ్యాండ్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఉదాహరణకు మనకు ఒక గుడి కావాలని అనుకుందాం.. రఫ్ గా మనం గుడి బొమ్మ గీస్తే అది అర్థం చేసుకొని మంచి పిక్చర్ జనరేట్ చేసి ఇస్తుంది. 

చాట్ జీపీటీ

సిరికి మనం కమాండ్స్ ఇవ్వడం ద్వారా ఏఐతో రూపొందించిన చాట్ జీపీటీ సాయం తీసుకుంటుంది. డాక్యుమెంట్లు, ఫొటోలను ఇచ్చి సంబంధించిన ప్రశ్నలను సంధిస్తే చాట్ జీపీటీ సాయం తీసుకొని అందిస్తుంది. ఖాతా లేకపోయినా ఐఫోన్ 16లో చాట్ జీపీటీని మనం వినియోగించవచ్చు. 

వెతికి చేతిలో పెట్టేస్తుంది..!

యాపిల్ ఇంటెలిజెన్స్ లో మెయిన్ పిల్లర్.. సమాచారాన్ని అడిగినప్పడు అందించడమే. మనం ఫొటోలు, సినిమా, క్రికెట్ మ్యాచ్ లింక్ లు మనం సేవ్ చేసి మర్చిపోతే సిరిని అడిగితే చాలు వెతికి మీ చేతులో పెట్టేస్తుంది.

ఐఫోన్‌ 16

ధర:  రూ.79,900
స్టోరేజీ: 128 జీబీ నుంచి 512 జీబీ వరకు
డిస్‌ప్లే:  6.1 అంగుళాల పొడవు.
స్పెషాలిటీ: వెనిలా వేరియంట్‌ 
2000 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు.
ఐవోఎస్‌ 18తో ఇది పనిచేస్తుంది.
128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ..
అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ కలర్స్ లో అందుబాటు

ఐఫోన్‌ 16 ప్లస్‌

ధర: రూ.89,900
స్టోరేజీ: 128 జీబీ నుంచి 512 జీబీ వరకు
డిస్ ప్లే: 6.7 అంగుళాల పొడవు
స్పెషాలిటీ: సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
48 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ బ్యాక్ కెమెరా  
12 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా  
ముందువైపు సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా  
కెమెరా కంట్రోల్‌ బటన్‌తో చాలా ఈజీగా ఫొటోలూ, వీడియోలు తీసుకోవచ్చు 
అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ అందుబాటు


ఐఫోన్‌ 16 ప్రొ,

ప్రో ధర: రూ.1,19,900 (128 జీబీ స్టోరేజీ మోడల్ ధర)
స్టోరేజీ: 128 జీబీ నుంచి 512 జీబీ వరకు
డిస్ ప్లే: డిస్‌ప్లే 6.3 అంగుళాలు
స్పెషాలిటీ: కూలింగ్ చాంబర్ ఫీచర్
4k120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయొచ్చు.
కలర్స్: బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం

ఐఫోన్‌ 16 ప్రొమ్యాక్స్‌ 

ధర: రూ.1,44,900 (256 జీబీ స్టోరేజీ ధర)
స్టోరేజీ: 256 జీబీ నుంచి 1 టీబీ వరకు
డిస్ ప్లే: 6.9 అంగుళాలు
స్పెషాలిటీ: కూలింగ్ చాంబర్ ఫీచర్
4k120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయొచ్చు.
కలర్స్: బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం

128 జీబీ స్టోరేజీ గల బేస్‌ మోడల్‌ 16 ప్రొ ధర రూ.1,19,900
256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో వచ్చే 16 ప్రొమ్యాక్స్‌ ధర రూ.1,44,900తో ప్రారంభం కానుంది.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. అలాగే 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వార్తలు