
మహాత్మ జ్యోతిభాపూలే బీసీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీకి గడువు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు బీసీ గురుకులాల కార్యదర్శి. 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీ కొరకు ఆన్‌లైన్ దరఖాస్తులను పొడిగిస్తూన్నట్లు ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్లు సమర్పించేందుకు గడువును 31.03.2025 నుండి 06.04.2025 వరకు పొడిగించినట్లు ఎంజేపి కార్యదర్శి బడుగు సైదులు, ఐఎఫ్ఎస్ - తెలియజేశారు. - ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
• మొత్తం బ్యాగ్ లాగ్ సీట్లు: 6,832
• ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 20, 2025 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
• మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
ఆన్ లైన్ అప్లికేషన్ చేసుకునేందుకు అధికారిక వెబ్ సైట్లు :
www.mjptbcwreis.telangana.gov.in
https://mjptbcadmissions.org