
హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన గడు వును పెంచుతున్నట్టు పాఠశాల విద్య డైరక్టర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వ హించే ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల కోసం ఏప్రిల్ 16న పరీక్షను నిర్వ హిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేయగా.. దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. మార్చి 10 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడానికి ఉన్న గడువును కాస్త ఈ నెల 15 వరకు పొడిగించినట్టు పాఠశాల విద్య డైరక్టర్ తెలిపారు.
6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 17న.. అలాగే 7వ తరగతి నుంంచి 10వ తరగతి వరకు మిగిలిసన సీట్ల కోసం నిర్వహించే పరీక్షలను ఏప్రిల్ 16న నిర్వహించనున్నారు. 6వ తరగతిలో సీట్ల కోసం ఏప్రిల్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ. 150 కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ విద్యార్థులకు రూ.75గా నిర్ణ యించినట్టు తెలిపారు. పూర్తి వివరాలు మోడల్ స్కూల్ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చినట్టు ప్రకటనలో తెలిపారు.