
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో లెక్చరర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మధుసూదన్ శర్మ ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఎంఏ తెలుగు, ఎకనామిక్స్, ఎం కామ్ కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 4 లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కాలేజీలో సంప్రదించాలన్నారు.