దివ్యాంగుల సాధికారత అవార్డుకుఅప్లికేషన్ల ఆహ్వానం

  • ఈ నెల 29 వరకు గడువు
  •  ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల సాధికారత అవార్డు–2024 కోసం అర్హులైన వ్యక్తులు/సంస్థలు అప్లై  చేసుకోవాలని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ  కోరారు. ప్రతి ఏడాది డిసెంబర్ 3 వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చే ఈ అవార్డు కోసం అభ్యర్థులు www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాలని గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన అప్లికేషన్లను ఈ నెల 29 వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో మలక్ పేటలోని వికలాంగుల శాఖ డైరెక్టరేట్ లో సమర్పించాలని ఆమె సూచించారు.