
న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : కనీసం 60 శాతం మార్కుల(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55%)తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయసు 27 ఏళ్లు మించరాదు.
సెలెక్షన్ ప్రాసెస్: డిగ్రీ మార్కులు, ఐ/ కలర్ బ్లైండ్‌నెస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 8 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.aaiclas.aero సంప్రదించాలి.