
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: మొత్తం 596 ఖాళీల్లో ఇంజినీరింగ్- సివిల్ విభాగంలో 62, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో 84, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో 440, ఆర్కిటెక్చర్ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి.
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 27 సంవత్సరాలు మించకూడదు. గేట్ 2020/ గేట్ 2021/ గేట్ 2022 స్కోరు ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 22 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.aai.aero వెబ్సైట్లో సంప్రదించాలి.