లింగంపేట, వెలుగు : లింగంపల్లి ఖుర్దు గ్రామంలో ఉన్న ప్రభుత్వ మైనార్టీ గురుకుల బాలుర స్కూల్లోని 5, 6, 7 క్లాసుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ పి.వెంకటరాములు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు.
5వ క్లాస్‌లో 40 సీట్లు, 6,7 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాల కోసం సెల్‌నెంబర్7995057919కు సంప్రదించాలని సూచించారు.